Naga Shourya : యంగ్ హీరో నాగ శౌర్య ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా ..!
Naga Shourya : టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఇటీవలే పెళ్లిపీటలు ఎక్కిన విషయం అందరికీ తెలిసిందే. బెంగళూరుకు చెందిన అనుషా శెట్టితో నాగశౌర్య వివాహం జరిగింది. బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటట్‌లో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో నాగశౌర్య పెళ్లి తంతు జరిగింది. ఇక పెళ్లి తర్వాత ఏర్పాటు చేసిన విందు రాయల్ వెడ్డింగ్‌ను తలపించిందని ఆ ఫోటోలు చూస్తేనే అర్దం అవుతుంది. ఆ ఫొటోలు నెట్టింట్లో కూడా వైరల్‌గా మారాయి.
ఇదిలా ఉంటే అనుషా శెట్టి సొంతంగా ఓ ఇంటిరీయర్ డిజైన్ కంపెనీని నిర్వహిస్తోంది. ఇక అనుషా తండ్రి కూడా బెంగళూరులో ఓ ప్రముఖ వ్యాపారవేత్త. ఆయనకు అక్కడ పలు వ్యాపారాలు ఉన్నట్లు, వీటి ద్వారా భారీగానే కూడ బెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమతో ఏ మాత్రం సంబంధం లేని అమ్మాయిని పెళ్లాడిన నాగశౌర్య ఏ మేర కట్నకానుకలు తీసుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే పెళ్లి సందర్భంగా నాగశౌర్య నగదు రూపంలో ఎలాంటి కట్నం తీసుకోలేదని తెలుస్తోంది. అదే సమయంలో అనుషా పేరు మీద ఉన్న ఆస్తులను నాగశౌర్య పేరు మీదకు మార్చనున్నట్లు సోషల్ మీడియా సర్కిళ్లలో జోరుగా వినిపిస్తోంది.
అనూష పేరు మీద దాదాపు రూ. 50 నుంచి 80 కోట్ల ఆస్తులు ఉన్నాయని, అందులో శౌర్య పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ చేయన్నారని తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజమో తెలియదు కానీ నాగ శౌర్య కట్న కానుకల విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.