For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Vishwak Sen: ప్రముఖ పొలిటిషియన్ రియల్ స్టోరీనే విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ .. అధి నిజమేనా ....

03:30 PM May 30, 2023 IST | Sowmya
Updated At - 03:30 PM May 30, 2023 IST
vishwak sen  ప్రముఖ పొలిటిషియన్ రియల్ స్టోరీనే విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ    అధి నిజమేనా
Advertisement

Vishwak Sen: తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోల్లో విశ్వక్ సేన్ (Vishwak Sen) ముందున్నాడు. ఇటీవలే తను హీరో కమ్ డైరెక్టర్‌గా రూపొందించిన ‘ధమ్కీ’ (Dhamki) మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాకు బెజవాడ ప్రసన్న కుమార్ స్టోరీ అందించగా.. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ హాజరైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే.. అప్‌కమింగ్ మూవీస్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు విశ్వక్. ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికొస్తే.. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ (Sitara Entertainments) బ్యానర్‌లో VS11 కూడా ఉంది. ఇటీవలే స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇదిలా ఉంటే, ఈ మూవీ ఆంధ్రప్రదేశ్‌కు (AP Politician) చెందిన వివాదాస్పద రాజకీయ నాయకుడి ట్రూ స్టోరీ (True Story) అని నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి.

అంతేకాదు విశ్వక్ సేన్ ఈ చిత్రంలో ఎల్లో పార్టీకి (Yellow Party) చెందిన పొలిటికల్ లీడర్‌గా కనిపిస్తాడని కూడా వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. అతను కాంట్రవర్సీ పొలిటిషియన్ అని తెలుస్తుండగా.. అసాధారణ కారణాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడని కూడా న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే VS11 చిత్రం ఎవరికీ అనధికారిక బయోపిక్ కాదు కానీ.. ఇందులోని లీడ్ రోల్ క్యారెక్టర్‌ను మాత్రం ఒక మాస్ పొలిటీషియన్ రియల్ స్టోరీ నుంచి ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారని టాక్.

Advertisement GKSC

అయితే ఆడియన్స్‌లో విశ్వక్ సేన్‌కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ పాత్రకు తనే బెస్ట్‌ అని ఫిక్స్ అయినట్లు సమాచారం. అయితే ఈ కథ ఏ రాజకీయ నాయకుడి గురించో తెలియాలంటే కనీసం ట్రైలర్ వచ్చే వరకైనా ఆగాల్సిందే.

Advertisement
Author Image