For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Suriya -Rolex :లోకేష్ కనగరాజ్ తో సూర్య రోలెక్స్ సినిమా త్వరలోనే పట్టాలు ఎక్కనుంది .. రోలెక్స్ పూర్తి వివరాలు ..

01:08 PM Aug 14, 2023 IST | Sowmya
Updated At - 01:08 PM Aug 14, 2023 IST
suriya  rolex  లోకేష్ కనగరాజ్ తో సూర్య  రోలెక్స్ సినిమా త్వరలోనే పట్టాలు ఎక్కనుంది    రోలెక్స్ పూర్తి వివరాలు
Advertisement

Suriya Rolex : ప్రస్తుతం తమిళ్ లో స్టార్ డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ దూసుకుపోతున్నాడు. తీసింది తక్కువ సినిమాలైనా అన్నిటితో భారీ హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ సృష్టించి తన రాబోయే సినిమాలపై కూడా ఆసక్తి పెంచాడు. ప్రస్తుతం లోకేష్ విజయ్ తో లియో సినిమాతో బిజీగా ఉన్నాడు. అంతకు ముందు  వచ్చిన విక్రమ్ సినిమాతో భారీ హిట్ కొట్టాడు లోకేష్.

చాలా సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ కి విక్రమ్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ తో పాటు సినిమా క్లైమాక్స్ లో సూర్య గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. రోలెక్స్ పాత్రలో సూర్య కనపడింది అయిదు నిమిషాలైనా ఈ పాత్ర బాగా వైరల్ అయింది. అంతకు ముందెప్పుడూ సూర్యని చూడని వైలెన్స్ నెగిటివ్ క్యారెక్టర్ లో చూడటంతో రోలెక్స్ పాత్ర బాగా వైరల్ అయింది. అయితే రోలెక్స్ పాత్ర సపరేట్ గా తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో సినిమా ఉంటుందని గతంలోనే లోకేష్ చెప్పాడు.

Advertisement GKSC

తాజాగా హీరో సూర్య ఫ్యాన్స్ మీట్ నిర్వహించగా ఇందులో తాను తర్వాత తీయబోయే సినిమాల గురించి చెప్పాడు. సూర్య ప్రస్తుతం కంగువా సినిమాతో బిజీగా ఉన్నాడు. కంగువా సినిమా తర్వాత తన 43వ సినిమా ఆ తర్వాత డైరెక్టర్ వెట్రిమారన్ తో వాడి వసల్ సినిమా ఉంటుంది. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ తో రోలెక్స్ సినిమా ఉంటుంది. ఇటీవలే లోకేష్ రోలెక్స్ కథ వినిపించాడు. చాలా బాగుంది. నేను ఓకే చెప్పాను అని తెలిపాడు సూర్య. ఇక అదయ్యాక మళ్ళీ లోకేష్ దర్శకత్వంలోనే ‘ఇరుంభుకై మాయావి’ చేస్తాం అని తెలిపాడు.

దీంతో సూర్య ఫ్యాన్స్, లోకేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం లోకేష్ కూడా సూర్యతో నా డ్రీం ప్రాజెక్టు ఇరుంభుకై మాయావి చేస్తాను అని తెలిపాడు. ఇక లోకేష్ లియో తర్వాత ఖైదీ 2 లేదా విక్రమ్ 2 చేయొచ్చని సమాచారం. ఆ తర్వాత రోలెక్స్ సినిమా ఉండొచ్చు. దీంతో ఈ ఇద్దరి కాంబోలో రోలెక్స్ సినిమా రావడానికి మరింత టైం పట్టొచ్చు. ఇటు సూర్య, అటు లోకేష్ కూడా వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. అభిమానులే కాక ప్రేక్షకులు కూడా రోలెక్స్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

Advertisement
Author Image