For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ " గాలోడు " సినిమా కోసం అంత తీసుకున్నాడా..!

12:36 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:36 PM May 13, 2024 IST
sudigali sudheer   సుడిగాలి సుధీర్   గాలోడు   సినిమా కోసం అంత తీసుకున్నాడా
Advertisement

Sudigali Sudheer : తెలుగు ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ టీవీ ఛానల్ లో ప్రాసం అవుతున్న జబర్ధస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెరపై మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సుధీర్... పలు రియాల్టీ షోలకు యాంకర్ ‏గానూ పనిచేశారు. అలానే పలు చిత్రాల్లో సహాయక పాత్రలలో కూడా నటించారు. ఇక ప్రస్తుతం సుధీర్ నటించిన గాలోడు సినిమా నవంబర్ 18న విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శకత్వం వహించిన ఈ మూవీలో గెహ్నా సిప్పి హీరోయిన్‌గా నటించింది. సంస్కృతి ఫిలింస్ నిర్మించిన ఈ సీన్ ఇమలో సప్తగిరి, శకలక శంకర్, తమ్మారెడి భరద్వాజ, పృధ్వీ పలు కీలక పాత్రల్లో నటించారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి సుధీర్ రెమ్యూనరేషన్‏ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా మారిన సుధీర్... ఆ తర్వాత 3 మంకీస్ సినిమాలో నటించారు. అయితే ప్రస్తుతం గాలోడు చిత్రానికి రూ. 40 నుంచి 50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 2 నుంచి రూ. 2.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా టాక్ నడుస్తుంది.

Advertisement GKSC

ఈ మేరకు ఇటీవల నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్ లో తనను ఇంట్లో ఒకడిగా ఆదరిస్తోన్న తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉంటానని... ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి తన ఆఖరి శ్వాస వరకు ప్రయత్నిస్తానని సుధీర్ అన్నారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి, తనది వన్‌మ్యాన్ షో అని ప్రేక్షకులు అనడానికి కారణం డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి అని సుధీర్ చెప్పారు. ఆ క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కుతుందని స్పష్టం చేశారు. కొద్ది కాలంగా జబర్ధస్త్ షోకు దూరంగా ఉంటున్న సుధీర్ తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.

Advertisement
Author Image