For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Yashoda Movie : అందువల్లే సమంత " యశోద " మూవీ బడ్జెట్ పెంచాల్సి వచ్చిందా..!

12:31 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:31 PM May 13, 2024 IST
yashoda movie   అందువల్లే సమంత   యశోద   మూవీ బడ్జెట్ పెంచాల్సి వచ్చిందా
Advertisement

Yashoda Movie : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం సామ్ నటించిన తాజా చిత్రం ‘యశోద’. ఈ సినిమాను హరి-హరీశ్‌లు సంయుక్తంగా డైరెక్ట్ చేస్తుండగా... శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా నవంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ తరుణంలోనే ఈ సినిమా ప్రమోషన్స్‌ను ను వేగవంతం కూడా చేశారు.

అయితే ఈ నేపధ్యంలోనే మూవీ బడ్జెట్ గురించి పలు ఆసక్తికర విషయాలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముందుగా ఈ సినిమాను 3 కోట్ల రూపాయల బడ్జెట్‌ తో ఫినిష్ చేయాలని డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అనుకున్నారట. కానీ ఈ స్టోరీ సమంతకు నచ్చి తాను చేయడానికి ఒకే చెప్పడంతో ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్‌... ఈ సినిమాకు బడ్జెట్ పెంచాలని నిర్ణయించుకొని భారీస్థాయిలో తెరకెక్కించినట్లు తెలుస్తుంది.

Advertisement GKSC

అలానే ప్రస్తుతం సమాజంలో సరోగసి అనేది కూడా మంచి పాయింట్‌ లాగా అనిపించడంతో... ఈ సినిమాను దాదాపు రూ. 40 కోట్లు ఖర్చుపెట్టారట. కాగా సైకలాజికల్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్, కల్పిక, దివ్య శ్రీపాద ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement
Author Image