For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Rajamouli: ఫ్యామిలి తో వెకేషన్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి ..... ఇంతికి ఎక్కడికి వెళ్లారో .....

10:32 AM Jun 28, 2023 IST | Sowmya
Updated At - 10:32 AM Jun 28, 2023 IST
rajamouli  ఫ్యామిలి  తో వెకేషన్ ని  ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి       ఇంతికి ఎక్కడికి వెళ్లారో
Advertisement

Rajamouli : రాజమౌళి.. బాహుబలితో దేశవ్యాప్తంగా పేరు సంపాదించి RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇక నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ కూడా రాజమౌళి పనితనాన్ని మెచ్చుకున్నారు. ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో రాజమౌళి ఒకరు. RRR సినిమా తర్వాత ఆస్కార్ వరకు రాజమౌళి ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు.

ఇక రాజమౌళి నెక్స్ట్ మహేష్ తో సినిమా చేయబోతున్నాడు. అసలు ఈ సినిమా ఏమి మొదలుపెట్టకపోయినా ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇన్నాళ్లు RRR తో బిజీగా ఉండి ఇటీవలే కొద్దిగా ఖాళీ అయ్యారు రాజమౌళి. త్వరలో మళ్ళీ మహేష్ సినిమాతో బిజీ కానున్నారు. దీంతో ఈ గ్యాప్ లో ఫ్యామిలీకి సమయం కేటాయించారు. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లారు జక్కన్న. ఇలా రాజమౌళి తన ఫ్యామిలీ తో వెకేషన్  ఎంజాయ్ చేస్తూ అక్కడి ఫోటోస్ ని షేర్ చేశారు .

Advertisement GKSC

రాజమౌళి, రమా రాజమౌళి, కొడుకు, కోడలు, మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెకేషన్ కోసం రాజమౌళి తమిళనాడులోని తూత్తుకుడి వెళ్లారు. అక్కడ బీచ్ పక్కన, రిసార్ట్స్ లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ రిసార్ట్ లో మొక్కలు నాటుతున్నాడు. ఇలా వెకేషన్ ని రాజమౌళి తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. జక్కన్న వెకేషన్ కి సంబంధించి కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  భాగా వైరల్ గా మారాయి.

Advertisement
Author Image