For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Salaar:అత్యధిక వ్యూస్ అందుకున్న టాప్ 5 లిస్ట్ లో 4 స్థానాలు ప్రభాస్ పేరు పైనే ...KGF తరువాత అత్యధిక వ్యూస్ లిస్ట్ లో సాలార్ ప్రధమ స్తానం ..

04:42 PM Jul 07, 2023 IST | Sowmya
Updated At - 04:42 PM Jul 07, 2023 IST
salaar అత్యధిక వ్యూస్ అందుకున్న టాప్ 5 లిస్ట్ లో 4 స్థానాలు ప్రభాస్ పేరు పైనే    kgf తరువాత అత్యధిక వ్యూస్ లిస్ట్ లో సాలార్ ప్రధమ స్తానం
Advertisement

Salaar : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), శ్రుతి హాసన్, మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సలార్’. కేజీఎఫ్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకనిర్మాతలు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని హోంబలే ఫిల్మ్స్ దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల కోసం మేకర్స్ నిన్న జులై 6న ఒక టీజర్ ని రిలీజ్ చేశారు. మరి మోస్ట్ యాంటిసిపేటడ్ టీజర్ వస్తే కొత్త రికార్డులు క్రియేట్ అవ్వాల్సిందేగా.

నిన్న తెల్లవారుజామున రిలీజ్ అయిన ఈ టీజర్ వ్యూస్, లైక్స్ విషయంలో సంచలనం సృష్టించింది. 24 గంటల్లో ఈ టీజర్ 83M+ మిలియన్ వ్యూస్, 1.6 మిలియన్ లైక్స్ అందుకుంది. కాగా కేవలం 24 గంటలోనే అత్యధిక వ్యూస్ అందుకున్న టాప్ 5 లిస్ట్ లో 4 స్థానాలు ప్రభాస్ పేరు పైనే ఉన్నాయి. దాదాపు 101M+ వ్యూస్ అందుకొని ఆదిపురుష్ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఇక నిన్నటి వరకు రెండో స్థానంలో KGF2 68.8M వ్యూస్ తో ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్ ని సలార్ కబ్జా చేసింది.

Advertisement GKSC

83M+ మిలియన్ వ్యూస్ తో సలార్ సెకండ్ ప్లేస్ తీసుకోని కేజీఎఫ్ 2 ని మూడో ప్లేస్ కి పంపించేసింది. ఇక నాలుగు, అయిదు స్థానాల్లో రాధే శ్యామ్ 46.6M వ్యూస్, సాహు 44.5M వ్యూస్ తో నిలిచాయి. ఇలా టాప్ 5 లిస్ట్ లో 4 ప్రభాస్ పేరు మీదనే ఉండడంతో రెబల్ అభిమానులు నెట్టింట హల్ చల్ చేస్తున్నారు.

Advertisement
Author Image