For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Pawan Kalyan :పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ కి బ్రేక్ పడినట్టే .. హరీష్ శంకర్ కెరీర్‌లో మరో ఏడాది బలి...

02:29 PM Jul 10, 2023 IST | Sowmya
Updated At - 02:29 PM Jul 10, 2023 IST
pawan kalyan  పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ కి బ్రేక్ పడినట్టే    హరీష్ శంకర్ కెరీర్‌లో మరో ఏడాది బలి
Advertisement

Pawan Kalyan : జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారో తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నటించిన ‘బ్రో’ మూవీ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే మరో మూడు చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇందులో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ ఇప్పటికే బడ్జెట్ ఇష్యూస్‌ కారణంగా ఆగిపోయింది. ఇక అనేక వాయిదాల తర్వాత సెట్స్‌పైకి వెళ్లిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ఇప్పటి వరకు ఒకే ఒక్క షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. పవన్ పాలిటిక్స్‌లో బిజీ అయిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఎక్కువ టైమ్ ప్రజల్లో ఉండటానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దీంతో ఈ ఏడాది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ జరగడం కష్టమనేనంటూ  సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ ఆగిపోతే డైరెక్టర్ హరీష్ శంకర్ పరిస్థితి ఏంటనే చర్చ నెట్టింట మొదలైంది. నిజానికి 2019లో ‘గద్దలకొండ గణేష్’ మూవీ తర్వాత మరో సినిమా చేయలేదు హరీష్. ఆయన పవన్‌తో సినిమా కోసం చాలా కాలం వెయిట్ చేశారు. ఇక షూటింగ్ మొదలైన తర్వాత కూడా పవన్ OG మూవీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మళ్లీ ఇప్పుడు ఈ ఏడాది ఉస్తాద్ షూటింగ్ జరగకపోవచ్చని రూమర్స్ వ్యాపించడం చూస్తుంటే.. హరీష్ శంకర్ కెరీర్‌లో మరో ఏడాది బలి? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే తను మాస్ మహారాజ రవితేజతో పీరియాడిక్ డ్రామా మూవీకి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement GKSC

ఇక పవన్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ తర్వాత అనౌన్స్ చేసిన OG మూవీ ఇప్పటికే నాలుగు షెడ్యూళ్లు కంప్లీట్ చేసుకుంది. మరో 20 రోజులు షూటింగ్‌లో పాల్గొంటే.. పవన్‌ పోర్షన్ అయిపోతుందని మేకర్స్ చెబుతున్నారు. దీన్ని బట్టి ఈ ఏడాది ‘బ్రో’ తర్వాత ఒక్క OG మూవీ మాత్రమే పూర్తవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement
Author Image