For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Mrunal Thakur:స్టార్ హీరోయిన్ గా ఎదిగిన మృణాల్ ఠాకూర్... ఒక్క సినిమాకి ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ...

01:47 PM Jul 09, 2023 IST | Sowmya
Updated At - 01:47 PM Jul 09, 2023 IST
mrunal thakur స్టార్ హీరోయిన్ గా ఎదిగిన మృణాల్ ఠాకూర్    ఒక్క సినిమాకి ఆమె తీసుకుంటున్న  రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Advertisement

Mrunal Thakur : ఎప్పుడో 2012 లో బాలీవుడ్ లో సీరియల్స్ తో కెరీర్ మొదలుపెట్టిన మృణాల్ ఠాకూర్ సీరియల్స్, సినిమాల్లో క్యారెక్టర్స్ చేసుకుంటూ బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదిగింది. వాటన్నిటితో రాని గుర్తింపు తెలుగులో చేసిన సీతారామం సినిమాతో ఒక్కసారిగా దేశమంతా పాపులర్ అయింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాతో మృణాల్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమాలో ఎంతో పద్దతిగల అమ్మాయిలా నటించి అందర్నీ మెప్పించింది. ఇక ఆ సినిమా తర్వాత తన బోల్డ్ ఫోటోషూట్స్ తో మరింత పాపులర్ అయి ఫాలోయింగ్ పెంచుకుంది మృణాల్.

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చాలా బిజీగా ఉంది. ఓ పక్క క్యూట్ క్యారెక్టర్స్ చేస్తూనే మరోపక్క బాలీవుడ్ లో బోల్డ్ క్యారెక్టర్స్ కి ఓకే చెప్తుండటంతో టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన మృణాల్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దీంతో ప్రస్తుతం మృణాల్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

Advertisement GKSC

ఇటీవల మృణాల్ లస్ట్ స్టోరీస్ లో బోల్డ్ క్యారెక్టర్ తో మెప్పించింది. ఇక మృణాల్ చేతిలో నాని 30వ సినిమా, విజయ్ దేవరకొండ సినిమాతో పాటు మూడు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. పలు సిరీస్ లకు కూడా త్వరలో ఓకే చెప్తుందని సమాచారం. బాలీవుడ్ లో ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ మూడు నుంచి నాలుగు కోట్ల రెమ్యునరేషన్ ఒక్క సినిమాకు తీసుకుంటుందని సమాచారం. ఇక టాలీవుడ్ లో కూడా మృణాల్ కి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఏర్పడటంతో ఇక్కడ కూడా దాదాపు 2 కోట్లు తీసుకుంటుందని సమాచారం.

Advertisement
Author Image