For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Guntur kaaram: మహేష్ బాబు మాస్ లుక్ తో.. అలాగే మాస్ మూవీ టైటిల్ తో ఎంట్రీ ఇచ్చేశారు .. పూర్తి వివరాలు మీ కోసం ...

08:44 PM May 31, 2023 IST | Sowmya
Updated At - 08:44 PM May 31, 2023 IST
guntur kaaram  మహేష్ బాబు మాస్ లుక్ తో   అలాగే మాస్ మూవీ టైటిల్ తో  ఎంట్రీ ఇచ్చేశారు     పూర్తి వివరాలు మీ కోసం
Advertisement

Guntur kaaram:సూపర్ స్టార్ మహేష్ బాబును (Mahesh Babu) ఆయన అభిమానులు ఊర మాస్ లుక్‌లో చూసి చాలా కాలమే అయ్యింది. ‘పోకిరి’, ‘దూకుడు’ సినిమాల్లో మహేష్ బాబును మళ్లీ చూడాలని ఆయన ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఆ సమయం వచ్చేసింది. ఆ గత సినిమాలకు మించిన ఊర మాస్ అవతార్‌లో మహేష్ బాబు దర్శనమిచ్చారు. దీంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఇది కదా మాకు కావాల్సింది అంటూ పండగ చేసుకుంటున్నారు.

‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తరవాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి ఇప్పుడు మహేష్ బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది మహేష్‌కు 28వ సినిమా. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు ‘గుంటూరు కారం’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు చాలా రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తోంది. దాన్ని నిజం చేస్తూ ఈ రోజు అదే టైటిల్‌ను ప్రకటించారు. అంతేకాదు, సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘గుంటూరు కారం’ మాస్ స్ట్రైక్ పేరుతో ఒక స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా హీరో పాత్రను పరిచయం చేశారు.

Advertisement GKSC

‘గుంటూరు కారం’ మాస్ స్ట్రైక్ వీడియోలో మహేష్ బాబు లుక్, యాటిట్యూడ్ చూసి ఫ్యాన్స్ సంతోషానికి అవధుల్లేవు. ఎరుపు రంగు గళ్ల చొక్కా, జీన్స్‌లో తలకు ఎరుపు రంగు తుండు కట్టుకుని మాస్ లుక్‌లో బాబు మెరిసిపోతున్నారు. నోట్లో నుంచి బీడీ తీయడం, దాన్ని అగ్గిపుల్లతో అంటించిత తీరు.. ఈ మధ్య కాలంలో బాబుని ఇంత మాస్ అవతారంలో ఫ్యాన్స్ చూడలేదు. దీనికి తోడు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ కొరియోగ్రఫీ, మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఈ వీడియోకి హైలైట్‌గా మారాయి. ‘ఏంది అట్టా చూస్తున్నా.. బీడీ త్రీడీలో కనబడతాందా’ అంటూ మహేష్ బాబు చెప్పే డైలాగ్ అభిమానులతో ఈలలు వేయిస్తుంది.

Advertisement
Author Image