Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు మేకప్ లేకుండా నటించిన సినిమాలు ఎన్నో తెలుసా..!
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వైవిధ్యమైన కథాంశాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా... అందులో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక తాజాగా రెండో షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుగనున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే అలా వైకుంఠపురంలో సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న త్రివిక్రమ్... దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబుతో మళ్ళీ సినిమా చేస్తుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా పూర్తయిన తరువాత... మహేష్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా మహేష్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మహేష్ బాబు సినీ కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించారు. సహజంగానే మహేష్ అందగాడు అని అందరికీ తెలిసిందే. ఆయన అందానికి మేకప్ కూడా అవసరం లేదు అని చెప్పొచ్చు. అయితే మహేష్ ఇప్పటి వరకు మేకప్ లేకుండా చేసిన ఒకే ఒక్క సినిమాలో నటించినట్లు తెలుస్తుంది.
తేజ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో నేచురల్ లుక్ కోసం మేకప్ లేకుండా నటించినట్లు తెలుస్తుంది. అందుకే ఆ సినిమాలో మహేష్ బాబు లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. తండ్రి హత్యకేసులో నిజం కోసం నిజాయితీగా పోరాడిన ఓ కుర్రాడిగా మహేష్ బాబు అందరి మనసులను దోచుకున్నాడు.