For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Jagapathi Babu -Mahesh Babu: జగపతిబాబు ఇగో మీధ కొట్టిన మహేష్ బాబు .. ఇద్ధరీ మధ్య వార్ కన్ఫర్మ్ .....

06:56 AM Jun 25, 2023 IST | Sowmya
Updated At - 06:56 AM Jun 25, 2023 IST
jagapathi babu  mahesh babu  జగపతిబాబు  ఇగో  మీధ కొట్టిన మహేష్ బాబు     ఇద్ధరీ మధ్య వార్ కన్ఫర్మ్
Advertisement

Jagapathi Babu -Mahesh Babu:జగపతిబాబు ,మహేష్ బాబు కాంబినేషన్‌కి మంచి క్రేజ్ ఉంది. ‘శ్రీమంతుడు’ సినిమాలో వీరిద్దరూ తండ్రీకొడులుగా నటించారు. వీరిద్దరూ తండ్రీకొడుకులుగా భలే ఉన్నారని ప్రేక్షకులు అన్నారు. ఆ తరవాత ‘మహర్షి’లో మహేష్ బాబుకు పోటీగా స్టైలిష్ విలన్‌గా జగపతిబాబు కనిపించారు. జగపతిబాబు (Jagapathi Babu) మహా ఇగోయిస్టిక్ అట. మహేష్ బాబు (Mahesh Babu) ఆ ఇగో మీద కొట్టారట. ఇంకేముంది.. ఇద్దరి మధ్య డిష్యుం డిష్యుం ఖాయం అంటున్నారు సోషల్ మీడియా బాబులు. ఈ డిష్యుం డిష్యుం నిజ జీవితంలో అనుకుంటున్నారేమో .. కాదండీ , సినిమాలో..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాలో జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు పాత్రకి ఇగో చాలా ఎక్కువట. ముఖ్యంగా తన ముందు ఎవరైనా సిగరెట్ కానీ, బీడీ కానీ కాల్చితే జగపతిబాబు పోషించిన పాత్రకి చిర్రెత్తుకొస్తుందట. ఆయనకి భయపడో, గౌరవంతోనో ఎవ్వరూ ఆయన ముందు స్మోక్ చేయరట. కానీ, మహేష్ బాబు పోషించిన హీరో పాత్ర మాత్రం జగ్గూ భాయ్ విలన్ క్యారెక్టర్ ముందు స్టయిల్‌గా స్మోక్ చేస్తాడు. ఇదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కథ. మొత్తం మీద జగపతిబాబు ఇగో మీద మహేష్ బాబు గట్టిగా కొట్టేశాడని అంటున్నారు.

Advertisement GKSC

మహేష్ బాబు తండ్రి నటశేఖర కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ‘మాస్ స్ట్రైక్’ పేరిట విడుదల చేసిన ‘గుంటూరు కారం’ టీజర్ అదిరిపోయింది. మహేష్ బాబు అభిమానులు ఆయన్ని ఎలా చూడాలని కోరుకుంటున్నారో అచ్చం అలానే, మంచి మాస్ లుక్‌లో కనిపించారు. ఎర్రటి గళ్ల చొక్కా, తలకి ఎర్ర తుండు, నోటిలో బీడీతో మహేష్ సరికొత్త లుక్‌తో ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించారు. ‘ఏంది అట్టా చూస్తున్నావు.. బీడీ 3Dలో కనపడుతుందా’ అంటూ గుంటూరు యాసలో మహేష్ చెప్పిన డైలాగు మారుమోగిపోయింది. ఈ ఒక్క వీడియోతో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు త్రివిక్రమ్.

Advertisement
Author Image