For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Sai Sushanth Reddy : వైరల్ అవుతున్న సాయి సుశాంత్ రెడ్డి ఎంగేజిమెంట్ పిక్ . సినిమా రీ రిలీజ్ అయిన సంతోషాన్ని కొనసాగిస్తూ తాను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం..

10:43 AM Jul 05, 2023 IST | Sowmya
Updated At - 10:43 AM Jul 05, 2023 IST
sai sushanth reddy   వైరల్ అవుతున్న సాయి సుశాంత్ రెడ్డి ఎంగేజిమెంట్ పిక్   సినిమా రీ రిలీజ్ అయిన సంతోషాన్ని కొనసాగిస్తూ తాను ప్రేమించిన అమ్మాయితో  నిశ్చితార్థం
Advertisement

Sai Sushanth Reddy : నటుడు సాయి సుశాంత్ రెడ్డి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు వేస్తూ ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో లీడ్ లో కనిపించి అందర్నీ మెప్పించాడు. ఈ నగరానికి ఏమైంది సినిమాలో సాయి సుశాంత్ చేసిన పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించడంతో అప్పట్నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సెకండ్ లీడ్ లో పలు సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

ఇటీవలే ఈ నగరానికి ఏమైంది సినిమా రిలీజ్ అయి 5 సంవత్సరాలు కావడంతో జూన్ 29న రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయి మొదటిసారి కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. తాజాగా సాయి సుశాంత్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇటీవలే ఈ నగరికి ఏమైంది రీ రిలీజ్ అయిన సంతోషంలో ఉన్నాడు సాయి సుశాంత్. అదే సంతోషాన్ని కొనసాగిస్తూ తాను ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు.

Advertisement GKSC

తనకి కాబోయే భార్యకి రింగ్ తొడుగుతున్న ఫొటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. అయితే ఆ అమ్మాయి ఎవరు అనేది వివరాలు ప్రకటించలేదు. ఇక ఈ నగరానికి ఏమైంది సినిమా అభిమానులు అతని పోస్ట్ కింద సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ సినిమాలో కూడా సాయి సుశాంత్ క్యారెక్టర్ కి నిశ్చితార్థం సీన్ ఉంటుంది. ఆ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. దీంతో దానిని, రియల్ ఎంగేజ్మెంట్ ని కంపేర్ చేస్తూ పలువురు నెటిజన్లు సరదా కామెంట్స్ పోస్ట్ చేస్తూ కంగ్రాట్స్ చెప్తున్నారు కొత్త జంటకు.

Advertisement
Author Image