Director Agnihotri : మరో సంచలనానికి తెరలేపిన కాశ్మీరి ఫైల్స్ డైరెక్టర్... ఈసారి ఏకంగా 11 భాషల్లో !
Director Agnihotri : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ఇటీవలే కశ్మీరీ పండిట్ల ఊచకోత నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన " ది కశ్మీర్ ఫైల్స్ " చిత్రం రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లు సాధించి ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. ఎన్ని వివాదాలు చుట్టుముట్టిన చివరికి బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో దర్మకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు.
ఈ సినిమాకి నిర్మాత మన తెలుగు ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ కావడం విశేషం. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో త్వరలోనే ఒక సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. వివేక్ రంజన్, అభిషేక్ అగర్వాల్ తమ నెక్స్ట్ సినిమాని తాజాగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ‘ది వ్యాక్సిన్ వార్’ టైటిల్ తో ఈ మూవీ రానున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు అగ్నిహోత్రి తన ట్విట్టర్ లో ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ లో ... మీ అందరికి తెలియని ఇండియా పోరాడిన ఒక అద్భుతమైన నిజాన్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాము. సైన్స్, ధైర్యం, విలువలతో ఇండియా గెలిచింది. ఈ సినిమా 2023 స్వాతంత్ర దినోత్సవం సంధర్భంగా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాను హిందీతో పాటు ఇంగ్లిష్, తెలుగు, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తమిళం, కన్నడ, ఉర్దూ, అస్సామీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఏకంగా 11 భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తుండడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ సినిమాలో నటించే నటీనటులు, ఇతర వివరాలను ప్రకటించనున్నారు.
ANNOUNCEMENT:
Presenting ‘THE VACCINE WAR’ - an incredible true story of a war that you didn’t know India fought. And won with its science, courage & great Indian values.
It will release on Independence Day, 2023. In 11 languages.
Please bless us.#TheVaccineWar pic.twitter.com/T4MGQwKBMg
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) November 10, 2022