For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Dil Raju Son: ఘనంగా జరగిన దిల్ రాజు సన్ ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్ .. దాదాపు 650 సెలబ్రిటీల మధ్య జరిగిన వేడుక ....

04:41 PM Jun 30, 2023 IST | Sowmya
Updated At - 04:41 PM Jun 30, 2023 IST
dil raju son  ఘనంగా జరగిన  దిల్ రాజు సన్ ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్    దాదాపు 650 సెలబ్రిటీల మధ్య జరిగిన  వేడుక
Advertisement

Dil Raju Son First Birthday: తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.. దేశంలోనే బడా సినిమా నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లోనూ ఆయన పెద్దపెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోగా.. గతేడాది బాబు అన్వీ రెడ్డి పుట్టాడు. ఈరోజు అన్వీ రెడ్డి తొలి పుట్టినరోజు. దీంతో దిల్ రాజు ఇంట పండగ వాతావరణం నెలకొంది. అన్వీ రెడ్డి తొలి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించడానికి దిల్ రాజు ప్లాన్ చేశారట. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో జరగనున్న అన్వీ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో సినీ పరిశ్రమ నుంచి భారీగా సెలబ్రిటీలు పాల్గొంటున్నారని సమాచారం.

తెలుగు సినీ పరిశ్రమ నుంచే కాకుండా ఇతర ఫిలిం ఇండస్ట్రీల నుంచి మొత్తం 650 మంది సెలబ్రిటీలను తన కొడుకు పుట్టినరోజు వేడుకలకు దిల్ రాజు ఆహ్వానించారని అంటున్నారు. ఇక టాలీవుడ్ నుంచి దాదాపు అందరు హీరోలు, ప్రముఖ నటీనటులు హాజరవుతారని సమాచారం. ఇదిలా ఉంటే, ఈ ఈవెంట్‌కు సంబంధించి దిల్ రాజు వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే, సెలబ్రేషన్స్ తరవాత మీడియాకు కంటెంట్ విడుదల చేస్తారని అంటున్నారు.

Advertisement GKSC

ఇదిలా ఉంటే, దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో కన్నుమూశారు. దిల్ రాజు-అనిత దంపతులకు కుమార్తె హన్షితారెడ్డి ఉన్నారు. ఆమెకు అప్పటికే వివాహం జరిగింది. దీంతో తండ్రికి ఒక తోడు కావాలని భావించిన హన్షితారెడ్డి.. దిల్ రాజుకు రెండో పెళ్లి చేశారు. కోవిడ్ టైమ్‌లో 2020లో వైఘా రెడ్డిని దిల్ రాజు పెళ్లాడారు. ఈ దంపతులకు 2022 జూన్ 29న అన్వీ రెడ్డి జన్మించాడు. దీంతో దిల్ రాజుకు వారసుడు పుట్టేశాడని అప్పట్లో ఈ వార్త బాగా వైరల్ అయ్యింది.

Advertisement
Author Image