For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Allu Arjun – Trivikram : అల్లు అర్జున్ -త్రివక్రం కాంబో లో మరో సినిమా .. వివరాలు తెలియాలి అంటే ...

01:12 PM Jul 03, 2023 IST | Sowmya
Updated At - 01:12 PM Jul 03, 2023 IST
allu arjun – trivikram   అల్లు అర్జున్  త్రివక్రం కాంబో లో మరో సినిమా    వివరాలు తెలియాలి అంటే
Advertisement

Allu Arjun – Trivikram : త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో సినిమాలు వచ్చి భారీ విజయాలు సాధించాయి. ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఈ మూడు సినిమాలు హారిక హాసిని క్రియేషన్స్ లో నిర్మాత రాధాకృష్ణ నిర్మించారు. గత కొన్ని రోజులుగా ఈ ముగ్గురి కాంబోలో మరో సినిమా వస్తుందని వార్తలు వస్తున్నాయి.  అయితే తాజాగా ఈ సినిమా గురించి అధికారిక అప్డేట్ ఇచ్చారు.

హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మాతలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ సారి వీరి కాంబోలో పాన్ ఇండియా సినిమా రాబోతుంది. దీంతో త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో నాలుగో సినిమా రాబోతుంది. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. దీనిపై బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది అల్లుఅర్జున్ 22వ సినిమాగా తెరకెక్కనుంది.

Advertisement GKSC

త్రివిక్రమ్ మహేష్ తో సినిమా, అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత ఈ సినిమా ఉండొచ్చని సమాచారం. ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ అల్లు అర్జున్ హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఈ కాంబోలో నాలుగోసారి హిట్ కి రెడీ అవుతున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులు ఈ సారి కూడా సినిమా  హిట్  అని ఫిక్స్ అయినట్టు అనిపిస్తుంది . సినిమా న్యూ అప్డేట్ ల  కోసం అభిమానులు ఆసక్తి గా  ఎదురు చూస్తున్నారు .

Advertisement
Author Image