For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

అయోధ్య లో డా.గజల్ శ్రీనివాస్ ఆలపించిన 'గేయ రామాయణం (హిందీ) ఆవిష్కరణ

11:01 AM Nov 07, 2024 IST | Sowmya
Updated At - 11:01 AM Nov 07, 2024 IST
అయోధ్య లో డా గజల్ శ్రీనివాస్ ఆలపించిన  గేయ రామాయణం  హిందీ  ఆవిష్కరణ
Advertisement

అయోధ్య : ప్రఖ్యాత గజల్ గాయకుడు డా.గజల్ శ్రీనివాస్ హిందీ భాషలో, స్వరపరచి అలపించిన "గేయ రామాయణాన్ని" శ్రీ విదుర్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ కుమారానంద గిరి మహారాజ్ అయోధ్యలో ఆవిష్కరించారు.

శ్రీ శ్రీ కుమారానంద గిరి మహారాజ్ మాట్లాడుతూ... డా.గజల్ శ్రీనివాస్ రామాయణాన్ని 17 నిమిషాల నిడివిలో గేయ రూపంలో సామాన్య ప్రజలకు ,భక్తులకు అర్ధమయ్యేలా రూపొందించడం అభినందనీయం అని ప్రశంసించారు., రచించిన కల్నల్ తిలక్ రాజ్ జలంధర్ ను అభినందించారు.

Advertisement GKSC

డా. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఈ గేయ రామాయణం పరమ పవిత్రమైన పుణ్య క్షేత్రం అయోధ్య లో ఆవిష్కరణ జరగడం నా పూర్వ జన్మ సుకృతమని, ఐదువేల సంవత్సరాల ఘన చరిత్రతో గిరి సంప్రదాయం కలిగిన శ్రీ విదుర ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ కుమారానంద గిరి మహారాజ్ దివ్య హస్తాలతో ఈ గేయ రామాణం లోకార్పణం కావడం ఒక గొప్ప దివ్య అనుభూతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాజ్ త్రిపాఠి, శ్రీ అంకిత్ తివారి, శ్రీ బుల్బుల్ పాండే, శ్రీ మెడికొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Dr Ghazal Srinivas : 98490 13697

Advertisement
Author Image