Raviteja Ravanasura Movie Climax Set క్లైమాక్స్ సీన్ కోసం అంతగా ఖర్చు పెడుతున్నారా..! 5 కోట్లతో రవితేజ సినిమాకు భారీ సెట్..
Raviteja Ravanasura Movie Climax Set రవితేజ లాయర్ గా కనిపించనున్న చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న రావణాసుర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం కోసం ఒక న్యూస్ తెగ హల్ చల్ చేస్తుంది. క్లైమాక్స్ సీన్ కోసం భారీ సెట్ వేయనున్నారని సమాచారం. ఇందుకోసం 5 కోట్లు ఖర్చు పెట్టానునున్నారని సమాచారం. హైదరాబాద్ లోనే ఈ సెట్ నిర్మించనున్నారని తెలుస్తుంది.
అయితే ఈ చిత్రంలో ఏకంగా అయిదుగురు హీరోయిన్స్ నటించనున్నారని తెలుస్తుంది. అను ఇమ్మానియేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ లు హీరోయిన్స్‌గా తీసుకోవడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఇందులో హీరో సుశాంత్ ఓ ముఖ్యపాత్రలో నటించనున్నాడు. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న రవితేజ గత ఏడాది క్రాక్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయినా ఏ మాత్రం తగ్గకుండా ఈ ఏడాది ఖిలాడి చిత్ర షూటింగ్ పూర్తి చేశారు. మంచి ఊపు మీద ఉన్న రవితేజ ఈ ఏడాది వరుస సినిమాలతో దూసుకొస్తున్నాడు. ఒకటి రెండు కాదు.. ఒకసారి ఏకంగా అరడజను సినిమాల్లో నటిస్తున్నాడు.
ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా చిత్రాల్లో నటిస్తున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా రావణాసుర సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. అయితే మరో విశేషం ఏంటంటే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించిన రోజునే రిలీజ్ డేట్ చెప్పేశారు. రావణాసురను సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.