ktr Carona news తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్... ట్విట్టర్ లో వెల్లడి
ktr Carona news తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. కొన్ని లక్షణాలు కనబడటంతో పరీక్షలు చేయించుకున్నానని.. కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్టు తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని, ముందుస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
కొన్ని లక్షణాలు కనబడటంతో పరీక్షలు చేయించుకున్నానని.. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు. ప్రస్తుతంలో హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు చెప్పారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో త్వరగా కోలువాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. కేటీఆర్ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు పెడుతున్నారు.
కరోనా తగ్గిపోయిందని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదని భ్రమపడ్డారు. కానీ మళ్ళీ కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. చాప కింద నీళ్ల విస్తరిస్తున్న కరోనా రోజురోజుకి భయం పెంచుతుంది. కేటీఆర్ రెండోసారి కరోనా బారిన పడటంతో ఇప్పుడు మళ్లీ కరోనా చర్చనీయాశమవుతోంది. అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.. 200-300 కరోనా కేసులు నమోదవుతున్నాయి.
