For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Movie గాడ్ ఫాదర్ కంటే ది గోస్ట్ కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా.. !

12:20 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:20 PM May 13, 2024 IST
movie గాడ్ ఫాదర్ కంటే ది గోస్ట్ కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా
Advertisement

Movie ఈ సంవత్సరం దసరా పండుగ మరింత జోష్ గా ఉండబోతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజున ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్.. నాగార్జున నటించిన ది ఘోస్ట్ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. అయితే ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడంతో ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి..

అయితే ప్రస్తుతం గాడ్ ఫాదర్ మూవీ కంటే ది గోస్ట్ మూవీకే హైప్ ఎక్కువగా క్రియేట్ అయిందని తెలుస్తుంది. ఇప్పటికే ది గోస్ట్ మూవీకి కావలసినంత బస్ క్రియేట్ చేశారని.. గాడ్ ఫాదర్ మూవీ విషయంలో ఇది ఎందుకో ముందు నుంచి మిస్ అవుతూ వచ్చిందని సినీ వర్గాలు అంటున్నాయి. గాడ్ ఫాదర్ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాగార్జున సినిమాను ప్రమోట్ చేయడంలో బిజీబిజీగా గడిపారు. దాంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉన్నాయి. గాడ్ ఫాదర్ కంటే గోస్ట్ మూవీకే పాజిటివ్ టాక్ తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం నెట్టింట కూడా ఇదే చర్చ నడుస్తుంది. అయితే ఏమవుతుంది అనేది తెలియాలి అంటే సినిమాలు విడుదలైన అంత వరకు వేచి చూడాల్సిందే..

Advertisement GKSC

మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్.. మళయాళ సూపర్ హిట్ లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది. మోహన్ రాజా దర్శకత్వంలో రామ్ చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగార్జున నటించిన ది గోస్ట్ మూవీకి ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. చిత్రాన్ని తెలుగులో పాటు తెలుగు తో పాటు హిందీలో కూడా విడుదల చేస్తునట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది.

Advertisement
Author Image