For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

రవితేజతో సినిమా చేయడం నా అదృష్టం : హీరోయిన్ శ్రీలీల ఇంటర్వ్యూ

12:42 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:42 PM May 13, 2024 IST
రవితేజతో సినిమా చేయడం నా అదృష్టం   హీరోయిన్ శ్రీలీల ఇంటర్వ్యూ
Advertisement

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధమాకా'. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్, ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న 'ధమాకా' ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపధ్యంలో హీరోయిన్ శ్రీలీల విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ధమాకా ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?

Advertisement GKSC

దర్శకుడు త్రినాథరావు నక్కిన గారు తన గత చిత్రం 'హలో గురు ప్రేమకోసమే' చిత్రంలో ఓ పాత్ర కోసం నన్ను సంప్రదించారు.  అప్పుడే రచయిత ప్రసన్న కూడా పరిచయమయ్యారు. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు. పెళ్లి సందడి విడుదల కాకముందే 'ధమాకా' కథ చెప్పారు. కథ చెప్పిన పది నిమిషాలకే ప్రాజెక్ట్ చేస్తానని చెప్పాను.

ధమాకా కథని ఎంచుకోవడానికి కారణం ?

ధమాకా చాలా మంచి ఎంటర్ టైనర్. చాలా హిలేరియస్ గా వుంటుంది. నాకు ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చాలా ఇష్టం.

తక్కువ సమయంలోనే రవితేజ గారితో పని చేసే అవకాశం అందుకున్నారు కదా .. ఎలా ఫీలౌతున్నారు ?

గ్రేట్ ఫుల్ ఫీలింగ్. రాఘవేంద్ర రావు గారి సినిమాతో లాంచ్ కావడం తర్వాత రవితేజ గారితో ధమాకా లాంటి బ్యూటీఫుల్ ప్రాజెక్ట్ చేయడం చాలా లక్కీగా వుంది. రోజూ దేవుడికి థాంక్స్ చెప్పుకుంటాను. మొదటి సినిమా అంతా కొత్తవారితో జరిగిపోయింది. రెండో సినిమా రవితేజ గారు లాంటి స్టార్ హీరో కావడంతో మొదట చాలా టెన్షన్ పడ్డా. మొదట్లో మాట్లాడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. అయితే ఆయనతో పని చేస్తుంటే కాన్ఫిడెన్స్ వచ్చింది. రవితేజ గారు చాలా మోటివేట్ చేస్తారు. ఆయనతో పని చేయడంలో ఒక కంఫర్ట్ వుంటుంది. సెట్ లో చాలా సపోర్ట్ చేస్తారు. రవితేజ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. కిక్, విక్రమార్కుడు సినిమాలు ఎన్ని సార్లు చూశానో లెక్కలేదు. ఆయన్ని మొదటిసారి సెట్ లో చూసినప్పుడు ఒక సర్ ప్రైజ్ ఫీలింగ్. పాత్రలో వేరియేషన్స్ ని చాలా ఈజీగా చూపించగలరు. ఇంత ఈజీగా ఎలా చేయగలుగుతున్నారని ఆయన్ని అడుగుతుంటాను.  'విక్రమార్కుడు' డ్యుయల్ రోల్ ఎంత అవుట్ స్టాండింగా చేశారో.. ధమాకాలో అంతే అద్భుతంగా చేశారు.

Viraat,Sreeleela Romantic entertainer 'I Love You Idiot' releasing grandly on December 17,Telugu Golden TV,My Mix Entertainments,telugu world news,www.teluguworldnow.com,v9 news telugu

రవితేజ గారి ఎనర్జీకి మ్యాచ్ చేశారా ?

సినిమా చూసి మీరే చెప్పాలి(నవ్వుతూ).  డ్యాన్సులు చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. నాకు చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే ఇష్టం. డ్యాన్స్ నేర్చుకున్నాను.

దర్శకుడు త్రినాథరావు నక్కిన గత చిత్రాలు చూశారా ?

చూశా. నేను లోకల్ పాటలు బెంగళూర్ లో వునప్పుడు తెగ వినేదాన్ని. అందులో కీర్తి సురేష్ గారి పాత్ర నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం చాలా అనందంగా వుంది. ఆయన చాలా పాజిటివ్ పర్సన్.

ధమాకాలో మీ ఫేవరేట్ సాంగ్ ?

జింతాక్ పాట బాగా నచ్చింది. తర్వాత వాట్స్ హ్యాపనింగ్ పాట. అందులో వయోలిన్ బిట్ చాలా ఇష్టం. ట్రైలర్ లో ఇద్దరూ ఇష్టమే అని చెప్పారు..  ఇందులో మీ పాత్ర ఎలా వుంటుంది. ఇందులో ప్రణవి అనే పాత్రలో కనిపిస్తా. డబల్ రోల్ తో ట్రావెల్ అయినప్పుడు ఒక కన్ఫ్యూజన్ వుంటుంది. ఇద్దరూ ఇష్టం అంటే.. ముగింపు ఎలా వుంటుందనేది ఇందులో ట్విస్ట్ ఫ్యాక్టర్.

Lyrical Video Of Dandakadiyal Song From Mass Maharaja Ravi Teja, Trinadha Rao Nakkina, DHAMAKA Released,Telugu Golden TV,My Mix Entertainments,telugu world news,www.teluguworldnow.comధమాకా షూటింగ్ లో మీ స్వీట్ మెమోరీస్ గురించి ?

స్పెయిన్ లో జింతాక్ పాట షూట్ చేసినప్పుడు రేపు షూటింగ్ అనగా నా కాస్ట్యుమ్ బ్యాగ్ పోయింది. చాలా టెన్షన్ పడ్డాను. ఐతే మేము వుండే లొకేషన్ నుండి మూడు గంటలు ప్రయాణించి మా డీవోపీ, డైరెక్టర్ వేరేవేరే ప్రదేశాలకు వెళ్లి అక్కడ నా కోసం షాపింగ్ చేసి అక్కడ నుండి ఫోటోలు పెట్టి ఓకే చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ నా కోసం షాపింగ్ చేస్తున్నట్లు అనిపించింది. అదొక మంచి క్యూట్ మూమెంట్.

ధమాకా నిర్మాతల గురించి ?

 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు చాలా  ఆప్యాయంగా చూసుకున్నారు. కొన్ని సందర్భాల్లో మోరల్ సపోర్ట్ ఇచ్చారు. 'మన అమ్మాయి' అనే వైబ్ ఇచ్చారు. వారి నిర్మాణంలో సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ధమాకా విడుదల కోసం చాలా ఎక్సయిటెడ్ గా ఎదురుచూస్తున్నాను. అదే సమయంలో లోపల చిన్న నెర్వస్ నెస్ కూడా వుంది. (నవ్వుతూ)

నటన, చదువుని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ?

నేను బేసిగ్గా స్విచాన్ స్విచాప్ పర్సన్ ని. యాక్టర్ అన్నప్పుడు అందరి ద్రుష్టి వుంటుంది. మెడిసిన్ చదువు విషయానికి వస్తే .. అక్కడ మనల్ని మనలానే వదిలేస్తారు. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోవడం ఇష్టం. షూటింగ్ నుండి వచ్చినా ఇంట్లో చదువుకుంటాను.

Magical Melody What’s Happening From Mass Maharaja Ravi Teja, Sreeleela, Trinadha Rao Nakkina, TG Vishwa Prasad’s DHAMAKA is out now,Telugu Golden TV,My Mix Et,telugu world news,www.teluguworldnow.comకొత్త సినిమాల గురించి ?

బాలకృష్ణ గారు, అనిల్ రావిపూడి సినిమా ఇటివలే షూటింగ్ స్టార్ట్ అయ్యింది.  అలాగే బోయపాటి-రామ్ గారి సినిమా కూడా చేస్తున్నాను. వైష్ణవ్ తేజ్ గారితో చేస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అలాగే వారాహి ప్రొడక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాను. నితిన్ గారితో ఒక సినిమా చేస్తున్నాను.  ఇంకొన్ని సినిమాలు వున్నాయి. నిర్మాణ సంస్థలు ప్రకటిస్తాయి.

ఆల్ ది బెస్ట్

థాంక్స్

Advertisement
Author Image