For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

బాలకృష్ణ గారితో కలసి డ్యాన్స్ చేయడం నా అదృష్టం : చంద్రిక రవి

12:42 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:42 PM May 13, 2024 IST
బాలకృష్ణ గారితో కలసి డ్యాన్స్ చేయడం నా అదృష్టం   చంద్రిక రవి
Advertisement

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వీరసింహారెడ్డి' జనవరి 12, 2023న సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'వీరసింహారెడ్డి' ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టాప్ ఫామ్‌ లో ఉన్న ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని  జై బాలయ్య, సుగుణ సుందరి పాటలు స్మాషింగ్ హిట్స్ గా నిలిచాయి. థర్డ్ సింగిల్ గా విడుదలైన 'మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి' పాట అయితే సెన్సేషనల్ స్పెషల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా అందరినీ అలరిస్తోంది. ఈ పాటలో బాలకృష్ణ సరసన సందడి చేసింది చంద్రిక రవి. ఆమె డ్యాన్సులు మాస్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో విలేఖరుల సమావేశంలో 'వీరసింహారెడ్డి' చిత్ర  విశేషాలని పంచుకున్నారు చంద్రికరవి.

మా బావ మనోభావాలు పాట విడుదలైన గంటల్లోనే 10 మిలియన్స్ వ్యూస్ ని క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ అయ్యింది.. ఈ ఘన విజయం ఎలా అనిపిస్తుంది ?

Advertisement GKSC

చాలా ఆనందంగా వుంది. ఆస్ట్రేలియాలో ఓ చిన్న టౌన్ లో పుట్టాను. అయితే మా కుటుంబ మూలాలు దక్షిణ భాతరదేశం లో వున్నాయి. చిన్నప్పటి నుండి సౌత్ సినిమాలు చూస్తూ పెరిగాను. నా కెరీర్ లో ఇంత త్వరగా ఇంత పెద్ద అవకాశం వస్తుందని అనుకోలేదు. బాలకృష్ణ గారి సినిమాలో అవకాశం రావడం నా కల నెరవేరినట్లయింది.

మీరు ఆస్ట్రేలియాలో పెరిగారు కదా.. ఒక సౌత్ కల్చర్ కి సంబధించిన పాటకు ఇంత చక్కగా ఎలా ఫెర్ ఫార్మ్ చేయగలిగారు ?

ఈ విషయంలో మా తల్లి తండ్రులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆస్ట్రేలియాలో పుట్టినప్పటికీ ఇంట్లో సౌత్ ఇండియన్ కల్చరే వుండేది. నాకు మూడేళ్ళు ఉన్నప్పుడే భరతనాట్యం, కూచిపూడి, కథక్ లాంటి నృత్యరూపకాలు నేర్పించారు. అలాగే వెస్ట్రన్ కల్చర్స్ కి సంబధించిన డ్యాన్సులు కూడా నేర్చుకున్నాను. మా అమ్మగారు మంచి డ్యాన్సర్. నాన్న గారు తబలా వాయిస్తారు. ఈ రకంగా సౌత్ ఇండియన్ కల్చర్, ఆర్ట్ అనేది నా జీవితంలో అంతర్భాగం అయ్యింది.

Nandamuri Balakrishna, Gopichand Malineni, Maithri movie makers Veerasimha Reddy's third single 'Ma Bava Manobhavalu' released grandly at the hands of Balayya fans,Telugu Golden TVబాలకృష్ణ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?

బాలకృష్ణ గారితో పని చేయడం ఒక కల నెరవేరినట్లయింది. బాలకృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన అంటే ఎంతో అభిమానం. స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాదు బాలకృష్ణ గారితో డ్యాన్స్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. జీవితం, సినిమాల పట్ల బాలకృష్ణ గారికి వున్న పరిజ్ఞానం అమోఘం. ఎన్నో గొప్ప విషయాలని పంచుకున్నారు. ఈ జ్ఞాపకాలని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను.

బాలకృష్ణ గారి లాంటి బిగ్ సూపర్ స్టార్ తో పని చేయడం మీకు ఇది మొదటిసారి కదా.. పాటకి, డ్యాన్సులకి, సోషల్ మీడియా నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది.?

చాలా అద్భుతమైన స్పందన వస్తోంది. పాటని ప్రేక్షకులు ఎంతగానో ప్రేమిస్తున్నారు. వారి ప్రేమ నాకు గొప్ప కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది. ఈ పాట నా జీవితాన్ని గొప్పగా మార్చింది. ఇదంతా బాలకృష్ణ గారి వలనే సాధ్యమైయింది.

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy Releasing Grandly Worldwide On January 12, 2023,Telugu Golden TV,My Mix Et,telugu world news,www.teluguworldnow.comమా బావ మనోభావాలు పాట చిత్రీకరణలో మీరు ఎదురుకున్న సవాల్ ఏమైనా ఉందా ?

పాట చిత్రీకరణ మరో రోజులో ముగుస్తుందనగా నా వెన్ను కాస్త బెణికింది. నొప్పి బాధ పెట్టింది. ఈ సంగతి సెట్ లో ఎవరికీ చెప్పలేదు. డ్యాన్సర్స్ అంతా అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేస్తున్నారు. వారి ఎనర్జీని మ్యాచ్ చేయడానికి నొప్పి లోనే నా శక్తిమేరకు కృషి చేశాను. ఎందుకంటే ఇలాంటి అవకాశం జీవితంలో ఒకసారే వస్తుంది. షూటింగ్ పూర్తయిన తర్వాత దర్శకుడు గోపీచంద్, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కి నొప్పి గురించి చెప్పాను. 'నొప్పితో బాధపడుతున్నావ్ అని మాకసలు తెలీదు. చాలా అద్భుతంగా చేశావు'' అని చెప్పారు. పాట విడుదలైన తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూస్తే కష్టానికి తగిన ఫలితం దక్కిందనిపించింది.

మా బావ మనోభావాలు పాటలో హనీ రోజ్ కూడా వున్నారు.. ఆమెతో కలసి పని చేయడం ఎలా అనిపించింది ?

హనీ రోజ్ తో కలసి పని చేయడం చాలా ఎంజాయ్ చేశాను. మేము ఇద్దరం మలయాళీలమే. చాలా ఫ్రెండ్లీ గా పని చేశాం.

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy’s First Single Jai Balayya Mass Anthem out now,Telugu Golden TV,My Mix Et,telugu world news,www.teluguworldnow.comఒక కోస్టార్ గా బాలకృష్ణ కి డ్యాన్సర్ గా ఎన్ని మార్కులు వేస్తారు ?

బాలకృష్ణ గారు అద్భుతమైన డ్యాన్సర్. వందకి వంద మార్కులు వేస్తాను. ఆయనతో కలసి డ్యాన్స్ చేయడం నా అదృష్టం.

మీరు మలయాళీ కదా.. తెలుగు చిత్ర పరిశ్రమలో పని చేయడం ఎలా అనిపించింది ?

నిజానికి నేను సగం మలయాళీ సగం తమిళ్. ఇండియన్ సినిమాని చూస్తూ పెరిగాను. తెలుగు చిత్ర పరిశ్రమ గొప్ప స్థితిలో వుంది. తెలుగులో సినిమాలో భాగం కావడం గర్వంగా వుంది.

Nandamuri Balakrishna, Shruti Haasan, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy Second Single- Suguna Sundari’s Lyrical Video Unveiled,Telugu Golden TV,My Mix Entertainmentsమీ కొత్త సినిమాల గురించి ?

కొన్ని తమిళ సినిమాలు చేస్తున్నా. అలాగే ఒక తెలుగు సినిమా చర్చల దశలో వుంది. అలాగే యుఎస్ లో కొన్ని షో కూడా ప్లానింగ్ లో వున్నాయి.

ఆల్ ది బెస్ట్

థాంక్స్

Advertisement
Author Image