మల్టీస్టారర్లు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధం : గాడ్ ఫాదర్ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్
భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రం హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబై లో గ్రాండ్ జరిగింది.
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ .. చిరంజీవి గారు ఈ సినిమా గురించి చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. సినిమాల పట్ల చిరంజీవి గారికి, మాకున్న ప్రేమ దీనికి కారణం. చిరంజీవి గారితో నటించడం మంచి అనుభవం. ఇందులో చాలా కొత్త పాత్ర చేశాను. మల్టీస్టారర్లు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే వుంటాను. మల్టీ స్టార్ చిత్రాలు చేయడం పరిశ్రమకు మంచింది. సినిమాలని నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ప్రపంచమంతా చూస్తారు. నెంబర్స్ పెరుగుతాయి. గాడ్ ఫాదర్ నా తొలి తెలుగు సినిమా. ప్రేక్షకులని కచ్చితంగా అలరిస్తుంది అన్నారు.
https://youtube.com/shorts/DvorTSG29Sg
