For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో ఎవ్వరూ సంతోషంగా లేరు: నిర్మాత సి. క‌ళ్యాణ్‌

11:37 PM Dec 08, 2021 IST | Sowmya
Updated At - 11:37 PM Dec 08, 2021 IST
ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో ఎవ్వరూ సంతోషంగా లేరు  నిర్మాత సి  క‌ళ్యాణ్‌
Advertisement

ఎన్ని జీవోలు వచ్చినా సరే ప్రేక్షకుడికి సినిమా కావాలని అఖండ నిరూపించింది. సినిమా అనేది చిన్న పరిశ్రమే కానీ ప్రభావం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అని అన్నారు ప్ర‌ముఖ నిర్మాత సి. క‌ళ్యాణ్‌. ప్ర‌స్తుతం ఆయ‌న నిర్మాణంలో స‌త్య‌దేవ్ హీరోగా గోపీ గణేష్‌ ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్సే` సినిమా రూపొందుతుంది. డిసెంబ‌రు 9 సి. క‌ళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మీడియాతో ముచ్చ‌టించారు.

టికెట్ రేట్లను తగ్గించడం వల్ల ప్రజలకు ఏదో మేలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం అనుకోవచ్చు. కానీ నా వస్తువు నేను తయారు చేసుకుని, నా వస్తువు రేటు నేను ఫిక్స్ చేసుకుంటాను. ఆ వస్తువును కొనాలా? వద్దా? సినిమాను చూడాలా? వద్దా? అనేది ప్రేక్షకుల ఇష్టం. కానీ మరీ ఇంతగా తగ్గించడం మాత్రం విచారించాల్సిన విషయం. ఏదేమైనా ఈ సమస్య త్వరలోనే సమసిపోతుందని అనుకుంటున్నాను. మేం అంతా కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.

Advertisement GKSC

ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో ఎవ్వరూ సంతోషంగా లేరు. మిర్యాల రవీందర్ రెడ్డి కాబట్టి రిలీజ్ చేయగలిగారు. అంతంత పర్సంటేజీలు తగ్గించుకుని రిలీజ్ చేశారు. ఈ రేట్ల మీద ఎంజీలు వేసుకోలేకపోతోన్నారు. అదనపు షోలు లేవు. బాలయ్య బాబు తన స్టామినా మీద కొట్టుకుని వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రిలీజ్ చేశారంటే నిర్మాతకు హ్యాట్సాఫ్.

ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను తీసుకురావాలని మేమే అడిగాం. పారదర్శకత కోసం మేం అడిగాం. కానీ మీడియా మాత్రం వక్రీకరించింది. అసలు విషయం తెలుసుకుని వార్తలు రాసేవారి కన్నా.. కొత్తగా క్రియేట్ చేసి రాసేవారు ఎక్కువయ్యారు. అందుకే ఇలా ఇగోలు హర్ట్ అయి ఇంత వరకు వచ్చిందని అనుకుంటున్నాను. అదనపు షోలు, మిడ్ నైట్ షోలను ప్రభుత్వమే అలవాటు చేసింది. ఇప్పుడు అవన్నీ ఆలోచించడం వేస్ట్. మనకు కావాల్సింది పరిశ్రమకు మంచి జరగడం.ఒకప్పుడు ఇలా ఉండేవాళ్లు కాదు. ఇంతకు ముందు సినిమా వాళ్లంతా మనవాళ్లే. కానీ ఎన్టీ రామారావు గారు పాలిటిక్స్‌లోకి రావడం, ఆ తరువాత సినిమా వాళ్లు కొందరు కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో గ్రూపులు మొదలయ్యాయి.

చిరంజీవి సినిమా విడుదల విషయంలో ఓ సారి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా టికెట్ రేట్లను తగ్గించారు. అయితే మేం వెళ్లి ఆయన్ను రిక్వెస్ట్ చేశాం. ప్రస్తుతం సినీ పరిశ్రమకి ఒక తండ్రి ఇక్కడ ఉన్నారు.. మరో తండ్రి అక్కడ ఉన్నారు. ఏ కష్టం వచ్చినా ముందుగా ఈ తండ్రి వద్దకే వెళ్తున్నాం. సినిమా వాళ్లదంతా ఏ రోజు హడావిడి ఆ రోజుదే. ఇద్దరు సీఎంలను ఒకే చోటకు తీసుకొచ్చి సత్కరిద్దామని అనుకున్నాం. కానీ అది కుదర్లేదు. ముందుకు నడిపించే వ్యక్తి లేకుండాపోయారు.

I am Proud to Produce The Godse Film,Producer C Kalyan Birthday,Hero Satya Dev,Heroine Aishwarua Lekshmi,Director Gopi ganesh,Latest Telugu movies,telugu golden tv,my mix entertainments,teluguworldnow.comగాడ్సే సినిమాను జనవరి 26న ప్లాన్ చేస్తున్నాం. మళ్లీ అదే దర్శకుడు గోపీ గణేష్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక నా హీరో సత్యదేవ్‌తోనూ ఇంకో సినిమా చేస్తాను. గాడ్సే తరువాత సత్యదేవ్‌కు చాలా మంచి పేరు వస్తుంది. సినిమా చూశాను. ఇక మంచి సినిమాకు నిర్మాతగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. అందరినీ మేల్కొపే చిత్రం. ఇందులో అందరి సమస్యలు చూపిస్తాం. అమ్మనాన్నలు కష్టపడి చదివిస్తే.. చదువుకుని ఏదో చేద్దామని అనుకుని ఏం చేయకుండా స్ట్రగుల్ అయ్యే ప్రతీ ఒక్కడి సమస్య. ప్రభుత్వాలు ఎలా ఆడుకుంటున్నాయ్..నిరుద్యోగం ఏంటి? ప్రభుత్వాలను ప్రశ్నించే పాయింట్ మీద వస్తుంది. దర్శకుడు ఎంత అద్భుతంగా డైరెక్ట్ చేశాడో.. హీరో అంత అద్భుతంగా చేశాడు. ఇద్ద‌రికీ మంచి పేరు వస్తుంది. గాడ్సే క్యారెక్టర్ కొత్త‌గా ఉంటుంది.

తమిళ నాడు నాకు ఓ మంచి బహుమతి ఇచ్చింది. ఆ గిఫ్ట్ మీ అందరితో పంచుకుంటాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చిన కళ్యాణ్ ఏం చేయబోతోన్నాడో చూపిస్తాను.

Advertisement
Author Image