FILM NEWS: "ఇస్మార్ట్ శంకర్" లో డాక్టర్‌గా చేశాను - "హీరో" సినిమాలోనూ అలాంటి పాత్రే : హీరోయిన్ నిధి అగర్వాల్
అశోక్ గల్లా. నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా `హీరో. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మంగళవారంనాడు విలేకరకులతో పలు విషయాలు తెలియజేశారు.
శ్రీరామ్ ఆదిత్య గారు ఓ సారి కథ చెప్పడానికి పిలిచారు. బయట ఆయన సినిమాల గురించి విన్నాను. ఆయన కథ చెప్పగానే ఆఫ్‌బీట్ సినిమాగా అనిపించింది. అయినా సాంగ్స్ వున్నాయి. కమర్షియల్ అంశాలున్న కథ బిన్నంగా అనిపించింది. పెద్ద స్టార్స్‌తో నటించినా గల్లా అశోక్ తో నటించడం కష్టం అనిపించలేదు. తను హీరోగా ప్రిపేర్ అయి వున్నాడు. అందుకే నటుడిగా కొత్తవాడనే ఫీల్ నాకు కలగలేదు.
ఇస్మార్ట్ శంకర్‌లో డాక్టర్‌గా చేశాను. హీరో సినిమాలోనూ అలాంటి పాత్రే వచ్చింది. కానీ తేడా వుంటుంది. నా పేరు సుబ్బు. నా ఫాదర్‌గా జగపతిబాబుగారు. హీరో తండ్రిగా నరేశ్ గారు నటించారు. ఈ కథ రెండు కుటుంబాల మధ్య జరిగే డ్రామా. సందర్భానుసారంగా కామెడీ కూడా వుంది. కథలో కొన్ని ట్విస్ట్‌లుకూడా వున్నాయి.
నేను డిఫరెంట్ పాత్రలు చేయాలనే చూస్తాను. సినిమా సినిమాకు చాలా నేర్చుకుంటున్నా. నేను పుట్టింది హైదరాబాద్‌లోనే. అందుకే తెలుగువారికి బాగా కనెక్ట్ అయ్యాను. హిందీ, తమిళ సినిమాలు చేసినా తెలుగు పరిశ్రమ అంటేనే నాకు చాలా ఇష్టం. షూటింగ్ వుంటే సెట్‌కు వెళ్ళి పని చేయాలి. హ్యాపీగా వుండాలి. నటిగా ఇంకా మెచ్చూర్డ్‌గా పాత్రలు ఎంచుకోవాలి అనేది గమనిస్తాను. షూట్ లేనప్పుడు మా ఫ్యామిలీ బిజినెస్ వుంది అదేవిధంగా ఛారిటబుల్ పౌండేషన్ వుంది అవి కూడా చూస్తుంటాను.ఇస్మార్ట్ చేశాక గ్లామర్ హీరోయిన్ అనే పేరు నాపై వుంది. గ్లామర్ పాత్రలు చేయడం అనేది కూడా నాకు ప్లస్ పాయింటే. తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను. అందులో కేరెక్టర్‌కు మేకప్ వుండదు. డల్ వాతావరణంలో ఫేస్ డల్‌గా కనిపించాలి. ఇలాంటి పాత్రలు దర్శకుల నుంచి పుట్టినవే. ఇలాంటి ఏ భాషలో వచ్చినా చేస్తాను. నాకు యాక్షన్ పాత్రలంటే ఇష్టం. హరిహర వీరమల్లు లో కొంచెం యాక్షన్ సీన్స్ వున్నాయి. చాలా ఇష్టంగా చేశాను. పవన్ కళ్యాన్‌లో నేను గమనించింది ఏమంటే, చాలా కూల్‌గా వుంటారు. పవన్ సార్ సినిమాలో పెద్ద రోల్. బెస్ట్ రోల్ నాకు దక్కింది. ఇది పీరియాడిక్ మూవీ. చాలా బాగుంది.