Bhakthi దేవుడు ఫోటోలు ఇంట్లో ఏ విధంగా ఉండాలి.. ఎటువైపు పెట్టాలో తెలుసా..!
Bhakthi రోజూ పూజించే వాళ్లకు కూడా దేవుడు ఫోటోలు ఎటువైపు ఉండాలి? ఎలా ఉండాలి? అనే విషయం తెలియదు. అసలు నిజానికి ఎలాంటి దేవుడు ఫోటోలు ఉండాలి. ఏవి ఉండకూడదు.. అనే విషయం కూడా చాలామందికి తెలియని విషయం..
సూర్య భగవాన్ ని నమస్కరించేటప్పుడు తూర్పు తిరిగి నమస్కరిస్తాం. అదే విధంగా ఆయన ఫోటోను ఇంట్లో తూర్పు వైపు ఉంచడం చాలా మంచిది.. దేవత మూర్తులు విగ్రహాలు అన్నింటిని కూడా ఇంట్లో తూర్పు వైపుగా ఆ చిత్రపటాలు పడమర వైపు చూస్తున్నట్టు పెట్టుకోవడం చాలా మంచిది.. ఇంట్లో ఉండే దేవుడు గది ఇంద్రస్థానం వైపు ఉండాలి.
అయితే ఇంట్లో దేవుడి గదిలో ఉంచే చిత్రపటాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ దేవుడువి కూడా రెండేసి పటాలు ఉంచరాదు.. పగిలిన చిరిగిపోయిన దేవుని విగ్రహాలు ఉంచకూడదు.. నవగ్రహాల విగ్రహాలు, శనీశ్వరుని విగ్రహం ఇంటి దేవుడు మూలలో ఉంచకూడదు. అదే విధంగా కోపంగా చూస్తున్నా శివుని చిత్రపటాన్ని కానీ.. విగ్రహాన్ని గాని ఇంట్లో ఉంచరాదు..అయితే ఏ దేవుడు విగ్రహాన్ని కూడా మనం ఇంట్లో ఉంచుకోవడం చేయకూడదు.. ఉంచుకోవాల్సి వస్తే ఆ దేవుడికి నిత్యం దీపారాధన చేసి నైవేద్యం తప్పనిసరిగా సమర్పించాలి.. కొందరి ఇంట్లో శివలింగాన్ని ఉంచుకుంటారు.. సందర్భంలో శివునికి నిత్యం అభిషేకం జరిపించాలి..అయితే ఇంట్లో దేవుడి మూలలో నిత్య దీపారాధన చేయటం అనేది ఎల్లవేళలా మంచిది