For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'హాస్టల్ డేస్‌' అంటేనే అందరికి గుర్తు వచ్చేది అల్లరి : ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆదిత్య మండల

04:17 PM Jul 12, 2023 IST | Sowmya
Updated At - 04:17 PM Jul 12, 2023 IST
 హాస్టల్ డేస్‌  అంటేనే అందరికి గుర్తు వచ్చేది అల్లరి   ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆదిత్య మండల
Advertisement

హాస్టల్ డేజ్ ఫ్రాంచైజీ యొక్క హిందీ మరియు తమిళ వెర్షన్‌లకు విస్తృత ప్రశంసలు లభించిన తర్వాత, ప్రైమ్ వీడియో మరియు TVF (ది వైరల్ ఫీవర్) హాస్టల్ డేస్ పేరుతో తెలుగులో సిరీస్‌ని తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ వీక్షకుల నుండి మంచి స్పందన లభించింది. మల్లి మన స్కూల్ డేస్ జ్ఞాపకాలకు దెగ్గర చేయడానికి ఈ సిరీస్ మన ముందుకు రాబోతుంది. ఆదిత్య మండల దర్శకత్వం వహించిన, ఐదు ఎపిసోడ్‌ల సిరీస్ భావోద్వేగాలు, నాటకం, వినోదం, నవ్వు మరియు అమూల్యమైన జీవిత పాఠాలతో కూడిన కథను చూపిస్తుంది.

గ్లోబల్ ప్రీమియర్‌కు సిద్ధం అవుతున్న తరుణంలో దర్శకుడు ఎంతో ఆసక్తిగా తన హాస్టల్ రోజులను గుర్తు చేసుకున్నారు. అసలు ఈ కథ రాయడానికి ఇన్స్పిరేషన్ అయిన తన హాస్టల్ అనుభూతుల గురంచి చెప్పుకొచ్చారు. " నాకు కూడా హాస్టల్ రోజులు ఎలా ఉంటాయో తెలుసు. ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఇష్టపడాను కూడా" అంటూ మురిసిపొయ్యారు. " హాస్టల్ అంటే నాకు గుర్తు వచ్చేది గ్యాంగ్. నేటి విద్యార్థులు ఉన్నత విద్యా ప్రపంచంలోని ట్రెండ్ సెట్టర్స్. ఫ్రెండ్ షిప్, బ్రదర్ హుడ్, సిస్టర్ హుడ్ ని ఈ సిరీస్ పోట్రె చేస్తూ కాలేజీ అనుభూతులకు చాలా దెగ్గరగా ఉంటుంది. ఇదివరకే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నాలాంటి వారికి ఇది ఈ సిరీస్ మళ్లీ ఆ బెస్ట్ డేస్ కి తీసుకుల్తుంది.

Advertisement GKSC

ఐదు భాగాల ఈ సిరీస్ తెలుగు సిరీస్ హిందీ, తమిళంలో కొంచం భిన్నంగా ఉంటుంది అని దర్శకుడు చెప్పారు. “గతంలో వివిధ భాషలలో (హిందీ & తమిళం) హాస్టల్ డేజ్ ఫార్మాట్ ఒకేలా ఉన్నప్పటికీ, ఈసారి మేము కథకు అదనపు ఎలిమెంట్‌ను అందించాము. అమ్మాయిల కోణం నుంచి అలోచించి, బ్యాక్గ్రౌండ్ సెట్ చేసాము. తెలుగు ఆడియన్స్ టేస్ట్ కి తగినట్టు సిరీస్ లో కొన్ని మార్పులు చేశాం. పాత్రలను కూడా కొంత మార్పలు చేసి రిలీజ్ చేస్తున్నాం.

ఆదిత్య మండల దర్శకత్వం వహించి, TVF నిర్మించిన, హాస్టల్ డేస్‌లో దరహాస్ మాటూరు, అక్షయ్ లగుసాని, మౌళి తనూజ్ ప్రశాంత్, అనన్య అకుల, ఐశ్వర్య హోలాకాల్, మరియు జైత్రి మకానా ప్రధాన పాత్రలు పోషించారు. హాస్టల్ డేస్ జూలై 13న 240 దేశాలు మరియు ప్రాంతాలలో ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా ప్రదర్శించబడుతుంది.

Advertisement
Author Image