For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Gosip హీరో నిఖిల్ తో అమిత్ షా భేటీ కావాలనుకుంటున్నారా..!

12:19 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:19 PM May 13, 2024 IST
gosip హీరో నిఖిల్ తో అమిత్ షా భేటీ కావాలనుకుంటున్నారా
Advertisement

Gosip బీజేపీ నేతలు తెలుగు హీరోల పైన కాన్సన్ట్రేషన్ చేశారో.. లేక ఆంధ్ర రాజకీయాల పైన కాన్సన్ట్రేషన్ చేశారో తెలియటం లేదు. ఈ మధ్య కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేరుగా ఎన్టీఆర్ ను కలిసి ఆయన ఆర్ఆర్అర్ మూవీ కోసం మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన చాలా బాగుందని మెచ్చుకున్నారని భోగొట్ట. అయితే చాలామంది కేవలం మీ సినిమా కోసం మాత్రమే కాకుండా.. ఆంధ్రాలో ఎన్టీఆర్ ను బీజేపీ తరపున పోటీ చేయాలని అమిత్ షా కోరారు అని వార్తలు హల్చల్ చేశాయి. అయితే దీనిపై ఇటు ఎన్టీఆర్ కానీ.. అటు బిజెపి నేతలు కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు..

అయితే ప్రస్తుతం అమిత్ షా యంగ్ హీరో నిఖిల్ ను కలవాలనుకుంటున్నట్టు సమాచారం. ఈయన తీసిన కార్తికేయ 2 మూవీ అమిత్ షాకు చాలా నచ్చిందని అందుకే అతను డైరెక్ట్ గా కలిసి విషెష్ చేయాలి అనుకుంటున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. హిందుత్వం.. కృష్ణ తత్వం.. ఆధారంగా చేసుకొని హీరో నిఖిల్ తీసిన కార్తికేయ 2 మూవీ థియేటర్ దగ్గర మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా మంచి హిట్ అయినందుకు అమిత్ షా నిఖిల్ ని అభినందించాలని అనుకుంటున్నారని తెలుస్తుంది.. అయితే అప్పట్లో జేపీ నడ్డా కూడా నిఖిల్ ను కలవాలనుకున్నారని సమాచారం వచ్చింది. అయితే జేపీ నడ్డా కన్ఫ్యూజ్ అయ్యారని.. ఆయన కలవాలనుకున్నది హీరో నిఖిల్ నా.. లేక హీరో నితిన్ నా.. అని ఎవరికి అర్థం కాలేదు. అయితే ప్రస్తుతం అమిత్ షా నిఖిల్ ని కలిస్తే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే.

Advertisement GKSC

Advertisement
Author Image