For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Politics : అయోధ్య రామ మందిరానికి భక్తుల అనుమతి ఎప్పుడంటే.. !

08:16 PM Jan 05, 2023 IST | Sowmya
Updated At - 08:16 PM Jan 05, 2023 IST
politics   అయోధ్య రామ మందిరానికి భక్తుల అనుమతి ఎప్పుడంటే
Advertisement

Politics ఎందరో హిందువులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతుంది అయితే త్వరలోనే ఆలయ నిర్మాణం పూర్తయిపోతుందని భక్తులను అనుమతిస్తారని వార్తలు వినిపిస్తూ వచ్చాయి అయితే ఈ విషయంపై తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఒక క్లారిటీ ఇచ్చేశారు..

హిందువుల ఆత్మభిమానం అయోధ్య రామ మందిరం.. ఎన్నో ఏళ్ళు గా ఎందరో ప్రాణాలు విడిచి ఈ ఆలయాన్ని దక్కించుకున్నారు.. ప్రస్తుతం ఆలయ నిర్మాణం పూర్తవుతుంది.. అయితే వచ్చే ఏడాది నుంచి భక్తులను అనుమతి ఇస్తారని ముందే చెప్పేసింది మోడీ ప్రభుత్వం.. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించిన హోం మంత్రి అమిత్ షా వచ్చే ఏడాది జనవరి ఒకటి కల్లా ఆలయం పూర్తయిపోతుందని అప్పటినుంచి భక్తులను అనుమతి ఇస్తారని తెలిపారు.. 2019 నవంబర్ 9న ఈ వివాదం పై సుప్రీంకోర్టు తుది తీర్పును ఇచ్చింది ఈ స్థలంలో రామాలయం కట్టుకోవడానికి అనుమతి ఇవ్వటంతో ప్రధాని నరేంద్ర మోడీ 2020 ఆగస్టు ఐదున భూమి పూజ చేసి ఈ ఆలయం నిర్మాణాన్ని చేపట్టారు..

Advertisement GKSC

తాజాగా త్రిపురా లో జరిగిన సమావేశంలో మాట్లాడిన హోమ్ మంత్రి అమిత్ షా.. అయోధ్య రామ మందిరం కోసం దేశ ప్రజలందరూ ఎన్నో ఏళ్లకు ఎదురుచూస్తున్నారని ఇప్పుడు ఆ కల నెరవేరి పోతుందని అన్నారు.. ఇందుకోసం కేసు కోర్టులో ఎన్నో ఏళ్ళు నడిచిందని ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారని గుర్తు చేశారు.. అలాగే  ప్రధాన మోడీ ఆలయాన్ని మొదలుపెట్టారని మరొకసారి గుర్తు చేశారు..  అలాగే సందర్భంగా ‘‘రాహుల్ బాబా విను.. 2024 జనవరి 1 నాటికి అయోధ్యలోని రామ మందిరం సిద్ధం అవుతుంది’’ అని రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Advertisement
Author Image