For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: తేజస్వి మదివాడ, బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి, తాజా చిత్రం "సర్కస్ కార్-2"

12:38 PM Dec 10, 2021 IST | Sowmya
Updated At - 12:38 PM Dec 10, 2021 IST
film news  తేజస్వి మదివాడ  బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి  తాజా చిత్రం  సర్కస్ కార్ 2
Advertisement

యువ ప్రతిభాశాలి నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో రూపొంది మంచి విజయం సాధించిన "సర్కస్ కార్"కి సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. "సర్కస్ కార్-2" పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కూడా నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా "తేజస్వి మదివాడ" ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా తేజస్వి మదివాడ మాట్లాడుతూ... "నల్లబిల్లి వెంకటేష్ డైరెక్షన్ లో వచ్చిన "సర్కస్ కార్" చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఆ చిత్రం సీక్వెల్ లో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. సీక్వెల్ స్టోరీ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంది. "సర్కస్ కార్-2"లో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాత శివరాజ్ గారికి థాంక్స్" అన్నారు. బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి, మస్త్ అలీ ముఖ్యపాత్రలో ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ పతాకంపై శివరాజు వికె ఈ క్రేజీ హారర్ ఎంటర్టైనర్ నిరిస్తున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరిలోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుపుకుంటోంది.

Advertisement GKSC

ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ అధినేత శివరాజు వి.కె మాట్లాడుతూ... "సర్కస్ కార్" సాధించిన ఘన విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో మా డైరెక్టర్ నల్లబిల్లి వెంకటేష్... ఈ సీక్వెల్ ను మరింత ఆసక్తిగా తెరకెక్కిస్తున్నారు. దెయ్యాలను ప్రత్యక్షంగా చూడాలని ఆ ఊరి పిల్లలు చేసే ప్రయత్నాలు... వాటి పరిణామాలు ప్రేక్షకుల పొట్టలు చెక్కలు చేస్తాయి. భయంతో కూడిన వినోదాన్ని పంచే "సర్కస్ కార్-2" మా దర్శకుడు నల్లబిల్లి వెంకటేష్. తేజస్వి మదివాడ, ఆషు రెడ్డిలకు చాలా మంచి పేరు తెస్తుంది" అన్నారు.

Heroine Tejaswi Madivada New Sequel Moive Sircus Car2,Bigg Boss Fame Ashu Reddy,Director Nallabelli Venkatesh,Latest Telugu Movies,telugu golden tv,my mix entertainments.teluguworldnow.com.1బేబి శ్రీదేవి, మాస్టర్ రోషన్, మాస్టర్ ధృవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఆర్ట్: బి.ఎస్.జగన్నాధరావు, డి.ఐ: డాలి శేఖర్, మ్యూజిక్: చైతన్య, ఎడిటింగ్: గౌతమ్ కుమార్, కెమెరా: జి.ఎస్.చక్రవర్తి రెడ్డి (చక్రి), నిర్మాత: శివరాజు వి.కె, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నల్లబిల్లి వెంకటేష్!!

Advertisement
Author Image