For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి హీరోయిన్ శ్రీలీల లుక్ విడుదల

11:19 PM Jun 14, 2023 IST | Sowmya
Updated At - 11:19 PM Jun 14, 2023 IST
 ఉస్తాద్ భగత్ సింగ్  నుంచి హీరోయిన్ శ్రీలీల లుక్ విడుదల
Advertisement

గబ్బర్ సింగ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం రెండవసారి చేతులు కలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్, నవీన్ యెర్నేని భారీ బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌ గా మాస్, ఎనర్జిటిక్, డైనమిక్ క్యారెక్టర్‌ లో కనిపించడం అభిమానులని అలరించింది.

ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల కథానాయిక గా నటిస్తోంది. ఈ రోజు శ్రీలీల బర్త్ డే సందర్భంగా చిత్రం నుంచి ఆమె లుక్  ని విడుదల చేశారు మేకర్స్. అలక, చిరు కోపంతో కనిపిస్తున్న శ్రీలీల క్యూట్ లుక్ అభిమానులని అలరించింది.

Advertisement GKSC

ఈ చిత్రంలో అశుతోష్ రానా, నవాబ్ షా, కెజిఎఫ్ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్,  టెంపర్ వంశీ సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు.

ఈ చిత్రం కోసం అగ్రశ్రేణి సాంకేతిక బృందం పని చేస్తోంది. అయనంక బోస్  సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా, ఛోటా కె ప్రసాద్‌ ఎడిటర్ గా పని చేస్తున్నారు. జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, పుష్ప, రంగస్థలం వంటి హిట్ చిత్రాల స్వరకర్త దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

యాక్షన్ సన్నివేశాలకు స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ యేడాది వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి వంటి హిట్‌లను అందించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో సక్సెస్ ఫుల్ రన్‌ను కొనసాగించడానికి సిద్ధంగా ఉంది.

Advertisement
Author Image