For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మేనేజర్ తో విబేధాలు లేవు, ఇకపై విడిగా కెరీర్ సాగిస్తాం : హీరోయిన్ రష్మిక మందన్న

11:18 PM Jun 22, 2023 IST | Sowmya
Updated At - 11:18 PM Jun 22, 2023 IST
మేనేజర్ తో విబేధాలు లేవు  ఇకపై విడిగా కెరీర్ సాగిస్తాం   హీరోయిన్ రష్మిక మందన్న
Advertisement

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన మేనేజర్ కిరణ్ తో ఇక కలిసి పనిచేయడం లేదనే విషయంపై మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. మేనేజర్ తో విబేధాల కారణంగానే రష్మిక ఆయనతో వర్క్ చేయడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూమర్స్ పై స్పందించింది రష్మిక. తాము విడిగా పని చేయాలని నిర్ణయించుకోవడం వెనక ఎలాంటి గొడవలు లేవని తెలిపింది.

ఆరోగ్యకర వాతావరణంలో కలిసి పనిచేశాం. పరస్పర ఒప్పందంతో విడిగా కెరీర్ లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ప్రొఫెషనల్ గా ఉండే వాళ్లం కాబట్టి అలాగే కలిసి వర్క్ చేశాం. ఇప్పుడు అంతే హుందాగా విడిగా పని చేయాలని అనుకుంటున్నాం అని రష్మిక, ఆమె మేనేజర్ తాజా ప్రకటనలో తెలిపారు.

Advertisement GKSC

Rashmika Mandanna, manager Kiran clarify on rumors,Telugu Golden TV,My Mix Entertainments,latest telugu news,www.teluguworldnow.com,Telugu World News,TNN News

Advertisement
Author Image