For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఐకానిక్ ఇండియా అందాల పోటీ విజేతగా నట్టి కరుణ

03:11 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:11 PM May 11, 2024 IST
ఐకానిక్ ఇండియా అందాల పోటీ విజేతగా నట్టి కరుణ
Advertisement

ఐకానిక్ ఇండియా అందాల పోటీ 2022 టైటిల్ విజేతగా నట్టి కరుణ నిలిచారు. దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ స్థాయిలో జరిగిన ఈ అందాల పోటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు అందాల భామలు పాల్గొన్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో ఈ ఏడాది విన్నర్ గా నట్టి కరుణ పోటీపడి, విజయం సాధించారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ కుమార్తె అయిన నట్టి కరుణ తమ సొంత బ్యానర్ లో నిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే.

heroine Nutty Karuna is the winner of the Iconic India beauty pageant,DSJ movie,Telugu Golden TV,my mix entertainments,www.teluguworldnow.com,

Advertisement GKSC

అలాగే నటన పట్ల తనకున్న అభిరుచికి అనుగుణంగా హీరోయిన్ గా మారి సినిమాలను చేస్తున్న విషయం వేరుగా చెప్పనక్కరలేదు. అందులో భాగంగా ఆమె తొలి ప్రయత్నంగా హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటించిన 'డి ఎస్ జె" (దయ్యంతో సహజీవనం) చిత్రం కొద్ది రోజుల క్రితం విడుదలై, నటిగా ఆమెకెంతో పేరుతెచ్చిపెట్టింది.

heroine Nutty Karuna is the winner of the Iconic India beauty pageant,DSJ movie,Telugu Golden TV,my mix entertainments,www.teluguworldnow.com,ఈ నేపథ్యంలో నటిగా మరింత పేరుతెచ్చుకోవాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న కరుణ ఐకానిక్ ఇండియా అందాల పోటీ 2022 టైటిల్ గెలుచుకోవడంతో ఆమెకు మరింత క్రేజ్ లభిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం నట్టి కరుణ మీడియాతో కొద్దిసేపు ముచ్చటిస్తూ...వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళతో పోటీపడి, ఈ టైటిల్ ను గెలుచుకోవడం ఎంతో ఆనందంగా, థ్రిల్లింగ్ గా ఉందని అన్నారు. త్వరలో గోవాలో, కేరళలో జరగబోయే అందాల పోటీలలో కూడా పాల్గొనబోతున్నానని అన్నారు.

heroine Nutty Karuna is the winner of the Iconic India beauty pageant,DSJ movie,Telugu Golden TV,my mix entertainments,www.teluguworldnow.com,

heroine Nutty Karuna is the winner of the Iconic India beauty pageant,DSJ movie,Telugu Golden TV,my mix entertainments,www.teluguworldnow.com,

heroine Nutty Karuna is the winner of the Iconic India beauty pageant,DSJ movie,Telugu Golden TV,my mix entertainments,www.teluguworldnow.com,

WhatsApp Image 2022-06-01 at 4.34.30 PM

WhatsApp Image 2022-06-01 at 4.34.29 PM

WhatsApp Image 2022-06-01 at 4.34.29 PM (1)ఇక సినిమా రంగం విషయానికి వస్తే, తాజాగా తెలుగులో రూపొందుతున్న ఓ రీమేక్ చిత్రంలో నటిస్తున్నానని వివరిస్తూ,, ఇందులో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండటంతో పాటు నటించడానికి అవకాశం చక్కటి పాత్ర లభించిందని చెప్పారు. ఇంకా తమిళంలో ఓ చిత్రంలో నటించమని ఆఫర్ వచ్చిందని, అయితే ఆ సినిమాకు సంబందించిన చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఓ అచ్చ తెలుగమ్మాయిగా తెలుగు చిత్రాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తూనే ఇతర బాషల చిత్రాలు చేసేందుకు కూడా సుముఖంగా ఉన్నానని కరుణ తెలిపారు.

Advertisement
Author Image