Gismat Jail Mandi Gowlidoddy : గౌలిదొడ్డిలో 'జిస్మత్ జైలు మండి' 15వ బ్రాంచ్ గ్రాండ్ లాంచ్
ఫుడ్ బిజినెస్ లో రోజురోజుకూ దూసుకుపోతున్న ‘జిస్మత్ జైలు మండి’ తాజాగా తన 15వ బ్రాంచ్ ను ప్రారంభించింది. హైదరాబాద్లోని బిజీ ఏరియా అయిన గౌలిదొడ్డిలో జయభేరీ అపార్ట్మెంట్స్ కు ఎదురుగా మంచి సౌకర్యవంతమైన బిల్డింగ్ లో ‘జిస్మత్ జైలు మండి’ కొత్త బ్రాంచ్ శనివారం సాయంత్రం స్టార్ట్ అయింది. హీరో శివాజీ, హీరోయిన్ అనన్య నాగళ్ల ముఖ్య అతిథులుగా హాజరై ‘జిస్మత్ జైలు మండి’ 15వ బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేం భోలే, ‘జిస్మత్ జైలు మండి’ ఓనర్ గౌతమి చౌదరి, పలువురు అతిథులు పాల్గొన్నారు.
‘జిస్మత్ జైలు మండి’ 15వ బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా హీరో శివాజీ మాట్లాడుతూ..‘‘‘జిస్మత్ జైలు మండి’ కన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫుడ్ చైన్. సహజంగా నేన ఒక ప్లేస్ కు వెళ్తున్నామంటే అన్నీ చెక్ చేసకుని వస్తా. అందుకే వీళ్ల గురించి కూడా అన్నీ చెక్ చేసుకుని వచ్చా. వీళ్ల ఫుడ్ చాలా బాగుంటుంది. అందుకే ఇన్ని బ్రాంచ్ లు నడపగలుగుతున్నారు. అమ్మాయిలు పబ్ లు, క్లబ్ లకు వెళ్లే ఈ కాలంలో గౌతమి లాంటి వాళ్లు వ్యాపార రంగంలోకి వచ్చి రాణిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. 50 బ్రాంచులు పెట్టాలనేది ఆమె టార్గెట్. ఆ టార్గెట్ ను త్వరగా రీచ్ అవ్వాలని కోరుకుంటూ నా బెస్ట్ విషెస్ చెబుతున్నా.’’ అని అన్నారు.
హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ..‘‘గౌలిదొడ్డిలోని ‘జిస్మత్ జైలు మండి’ ఓపెనింగ్ కు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. జైలు కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉంది. ఫుడ్ టేస్ట్, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అందుకే ఇన్ని బ్రాంచెస్ నడపగలుగుతున్నారు. మంచి ఫుడ్ తినాలనుకునే వాళ్లంతా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ‘జిస్మత్ జైలు మండి’కి వచ్చేయండి’’ అని చెప్పారు.
‘జిస్మత్ జైలు మండి’ ఓనర్ గౌతమి చౌదరి మాట్లాడుతూ..‘‘శివాజీగారికి, అనన్య గారికి థ్యాంక్యూ సోమచ్. మా పార్టనర్ గౌతమ్ కు కంగ్రాట్స్. ఇది 15వ బ్రాంచ్.. ఈ జర్నీ అంత ఈజీగా కాలేదు. మాకు ఎలాంటి రెస్టారెంట్ కావాలో అలా డిజైన్ చేసుకున్నాము. మనకేం కావాలో ఆ గ్యాప్ ను ఫిల్ చేయాలని ఒక బిజినెస్ మ్యాన్ కొటేషన్ ను చదివి ఇలా ప్లాన్ చేశాం. రెస్టారెంట్స్ కు వెళ్తుంటే నాకు ఏమనిపించిందంటే.. మనకు కావాల్సిన క్వాలిటీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందుబాటు ధరలో లేదనిపించింది. మేము ఆయిల్స్ రీయూజ్ చేయము. ఫుడ్ కలర్స్ యాడ్ చేయము. స్టాక్ ఏరోజూ ఉండదు. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు జరిగినప్పుడు మా రెస్టారెంట్స్ లోనూ ప్రతిసారీ జరుగుతుంటాయి. ఇవన్నీ ఆలోచించి జాగ్రత్తగా, క్వాలిటీతో మేము బిజినెస్ చేస్తున్నాం. మాకున్న దేవుళ్లు మా కస్టమర్లే. ఇదే క్వాలిటీని ఎల్లప్పటికీ మెయిన్ టెన్ చేస్తాం.’’ అని తెలిపారు.