Entertainment : సినీ ఇండస్ట్రీలో 17 ఏళ్లు పూర్తి చేసుకున్న తమన్నా..
Entertainment మిల్కీ బ్యూటీ తమన్న సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 17 ఏళ్లు అవుతుంది అయితే ఈ భామ ఎప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చింది.. అయితే ఈ భామ ఏ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అలాగే హీరోయిన్ గా తనను నిలబెట్టిన సినిమా ఏంటో ఒకసారి చూద్దాం..
తమన్నా టాలీవుడ్ లో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అయితే ఇప్పటికి హీరోయిన్గా రాణిస్తున్న ఈమె సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 17 ఏళ్లు అయిపోతుంది అయితే మొదటిసారి ఈమె.. 2005 సంవత్సరంలో చాంద్ సా రోషన్ చెహరా సినిమాలో నటించింది. అదే ఏడాది తెలుగు లో శ్రీ సినిమాలో మంచు హీరోకు జోడీగా నటించింది.. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు ఈ తర్వాత మాత్రం శేఖర్ కమలా దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాతో తమన్నా టాలీవుడ్ లో హీరోయిన్ గా స్థిరపడిపోయింది.. అలాగే టాలీవుడ్ లో అందరి యంగ్ హీరోలతో నటించింది ఈ భామ అలాగే సైరా నరసింహారెడ్డి చిత్రంలో మెగాస్టార్ పక్కన కూడా అలరించింది ప్రస్తుతం ఈమె మరొకసారి చిరంజీవికి జోడిగా బోలాశంకర్ చిత్రంలో నటిస్తోంది..
అయితే సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి ఇన్నేళ్లు అయినప్పటికీ ఈమె తన తరగాని అందంతో ఇప్పటికీ సినీ అవకాశాలు అందుకుంటూ ఉంటుంది అలాగే స్టార్ హీరోల పక్కన నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది అలాగే హీరోయిన్లు కెరీర్ చాలా తక్కువగానే ఉంటుంది కానీ ఈ భామ మాత్రం ఇన్నేళ్లు సక్సెస్ గా నడిపించుకొచ్చింది