For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood News: జూలై 20న అమేజాన్ ప్రైమ్ లో విడుదలకానున్న విక్టరీ వెంకటేష్  "నారప్ప"

03:04 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:04 PM May 11, 2024 IST
tollywood news  జూలై 20న అమేజాన్ ప్రైమ్ లో విడుదలకానున్న విక్టరీ వెంకటేష్   నారప్ప
Advertisement

Hero Victory Venkatesh Narappa Movie Relased in Amazon Prime Videos, Srikanth Addala, Priyamani, Mani Sharma, Telugu World Now,

Tollywood News: జూలై 20న అమేజాన్ ప్రైమ్ లో విడుదలకానున్న విక్టరీ వెంకటేష్  "నారప్ప"

Advertisement GKSC

విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `నార‌ప్ప‌`. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ లో విడుదలకానుంది.

ఇప్ప‌టికే పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 20న అమేజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల కానుంది. ఈ విషయాన్ని  అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.

ఈ మూవీలో డిఫ‌రెంట్‌ షేడ్స్ ఉన్న స‌రికొత్త పాత్రల‌లో విక్ట‌రి వెంకటేష్ కనిపించనున్నారు. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నార‌ప్ప భార్య `సుందరమ్మ`గా తెలుగు వారికి  చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు.

ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ మ‌రియు ఇత‌ర ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.

తారాగ‌ణం: విక్టరి వెంకటేష్‌, ప్రియమణి, కార్తిక్ ర‌త్నం, రావు ర‌మేష్‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల
నిర్మాతలు: డి. సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు
ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌
ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌
కథ: వెట్రిమారన్‌
స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్
ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌
లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం
ఫైనాన్స్‌ కంట్రోలర్‌: జి.రమేష్‌రెడ్డి
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రామబాలాజి డి.
ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఏపీ పాల్ పండీ
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్ డొంకాడ
కో- ప్రొడ్యూసర్‌: దేవి శ్రీదేవి సతీష్‌

Advertisement
Author Image