For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tharun : "నా పెళ్లి గురించి నేనే క్లారిటీ ఇస్తా ఈ విషయం లో పుకార్లను నమ్మకండి" అంటూ తరుణ్ పోస్ట్ ...

04:12 PM Aug 02, 2023 IST | Sowmya
Updated At - 04:12 PM Aug 02, 2023 IST
tharun    నా పెళ్లి గురించి నేనే క్లారిటీ ఇస్తా ఈ విషయం లో పుకార్లను నమ్మకండి  అంటూ తరుణ్ పోస్ట్
Advertisement

Tharun : టాలీవుడ్(Tollywood) లో బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరుణ్ ఆ తర్వాత హీరోగా నువ్వే నువ్వే, నువ్వే కావలి.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. 90s కిడ్స్ కి తరుణ్ ఫేవరేట్ హీరో అయిపోయాడు.ఇంకా అమ్మాయిలకు అయితే మరింత ఫేవరేట్ అయ్యాడు తరుణ్. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ వరుస పరాజయం వల్ల తరుణ్ కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.

సినిమాలకు గ్యాప్ ఇచ్చినా సినిమా ఈవెంట్స్ లో మాత్రం అప్పుడప్పుడూ కనిపిస్తునే ఉంటారు. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. అయితే 40 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి గురించి మాత్రం చెప్పట్లేదు. ఎప్పటికప్పుడు తరుణ్ వివాహం త్వరలో జరగబోతుందని వార్తలు తెరమీదకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా తరుణ్ వివాహం ఫిక్సయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇండస్ట్రీలో ఓ స్టార్ నటుడి కూతురితో తరుణ్ వివాహం జరుగుతుందని వార్తలు వచ్చాయి.

Advertisement GKSC

తాజాగా అతన పెళ్లిపై వస్తున్న వార్తలని తరుణ్ ఖండిస్తూ క్లారిటీ ఇచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో తరుణ్ అధికారికంగా పోస్ట్ చేసాడు. నా పెళ్లి గురించి కొన్ని రూమర్స్ చూశాను. ఈ ప్రచారం నిజం కాదు. నేను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా నా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయం చెబుతాను, పెళ్లి గురించి కూడా ఏదైనా ఉంటె నేనే చెప్తాను, నా పెళ్లి విషయంలో పుకార్లు నమ్మకండి, సృష్టించకండి. అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని తెలిపాడు తరుణ్.

Advertisement
Author Image