Entertainment : ఈ ఫోటోలో స్టైలిష్ లుక్ ఇస్తున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..
Entertainment సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వస్తున్నాయి ఇందులో ఇప్పటికే చార్మి రామ్ చరణ్ అల్లు అర్జున్ త్రిష వంటి ఎందరో నటీనటులు ఉన్నారు ముఖ్యంగా తమ అభిమాన హీరోల చిన్ననాటి ఫోటోలు అంటే ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు అభిమానులు అయితే తాజాగా మరో హీరో చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయం ప్రేక్షకులకు చేరువవుతూనే వస్తుంది అలాగే ఈ నేపథ్యంలో తాజాగా ఓ టాలీవుడ్ హీరో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ ఫోటో బుడ్డోడు టాలీవుడ్ హీరో.. లవర్ బాయ్ తరుణ్.. బాల నటుడిగా తన కెరీర్ను ప్రారంభించిన తరుణ్.. దళపతి, ఆదిత్య 369, గౌరమ్మ, తేజ, అంజలి వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. సీనియర్ హీరోయిన్ రోజా రమణి తనయుడు అయిన తరుణ్ బాలునటుడుగా మంచి పేరు సంపాదించుకున్నాక.. హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. శ్రేయ హీరోయిన్గా నటించిన నువ్వే కావాలి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, చిరుజల్లు, అదృష్టం, నువ్వే నువ్వే.. వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు.. అయితే కొన్నాళ్లపాటు టాలీవుడ్లో తిరుగులేని హీరోగా హిట్లు సంపాదించుకున్న తరుణ్ తర్వాత మాత్రం వరుస డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు అలాగే ప్రస్తుతం మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు..