Entertainment : తళపతి విజయ్ ను పొగడ్తలతో ముంచెత్తిన శ్రీకాంత్..
Entertainment దళపతి విజయ్ తాజాగా నటించిన చిత్రం వరిసు.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. అయితే తాజాగా దీనికి సంబంధించిన ఆడియో రిలీజ్ కార్యక్రమం చెన్నైలో జరగగా శ్రీకాంత్ హాజరయ్యారు ఈ క్రమంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరో శ్రీకాంత్..
తలపతి విజయ్ ను పొగడ్తలతో ముంచేత్తారు హీరో శ్రీకాంత్ ఇన్నాళ్లు నా కెరియర్లో ఇలాంటి హీరోను చూడలేదంటూ చెప్పుకొచ్చారు అలాగే ఇప్పటివరకు 125 వరకు సినిమాలు చేశానని అయితే ఇలాంటి హీరోని మాత్రం ఎక్కడా చూడలేదని నాకు కనిపించలేదని చెప్పారు.. హీరో విజయ్ రియల్ లైఫ్ సూపర్ స్టార్ అని చెప్పుకొచ్చాడు శ్రీకాంత్.. అంతేకాకుండా అతని నటన మరొక స్థాయిలో ఉంటుందంటూ అంతటి అద్భుతమైన నటుడు తన కెరీర్లు ఎదిగే క్రమంలో కూడా ఎంతో పద్ధతిగా నడుచుకున్నారని వ్యక్తిత్వం గురించి చెప్పుకొచ్చారు వ్యక్తిత్వం పరంగా ఎంతో మంచి వ్యక్తి అని అన్నారు అలాగే ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు..
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సంక్రాంతికి విడుదలయ్యే చాలా సినిమాలు బరిలో ఉన్నాయి.. దీనిలో నందమురి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి సినిమాలు సైతం ఉన్నాయి.. అయితే పోటీ మాత్రం ఈ సంక్రాంతికి గట్టిగా ఉంటుందని చెప్పాలి ఈ సందర్భంగా దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లను ఈ చిత్రం కోసం బ్లాక్ చేసి పెట్టారనే వాదనలు కూడా వినిపించాయి అయితే ఈ విషయంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు దిల్ రాజు..