For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఎడ్యుకేషన్స్ బాక్డ్రాప్ లో సత్యదేవ్ హీరోగా సి.కళ్యాణ్ నిర్మిస్తోన్న "గాడ్సే" రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

01:59 PM May 03, 2024 IST | Sowmya
Updated At - 01:59 PM May 03, 2024 IST
ఎడ్యుకేషన్స్ బాక్డ్రాప్ లో సత్యదేవ్ హీరోగా సి కళ్యాణ్ నిర్మిస్తోన్న  గాడ్సే  రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
Advertisement

'జ్యోతిలక్ష్మీ, బ్లఫ్ మాస్టర్' చిత్రాలతో హీరోగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ హీరోగా, ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా సికే స్క్రీన్స్ పతాకంపై గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం "గాడ్సే". ఎడ్యుకేషన్స్ బాక్డ్రాప్ లో రూపొందుతోన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 11న హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది.. ఈ సందర్బంగా ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత సి.కళ్యాణ్, ప్రముఖ నిర్మాత కేయస్ రామారావు,  హీరో సత్యదేవ్, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ, దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి, సంగీత దర్శకుడు సునీల్ కాశ్యప్, నటులు ప్రకాష్ నాగ్, అశోక్ కుమార్ పాల్గొన్నారు..

హీరో సత్యదేవ్ మాట్లాడుతూ... ' నా లైఫ్ లో జ్యోతిలక్ష్మీ చాలా ముఖ్యమైన సినిమా.. బ్లఫ్ మాస్టర్ కూడా ముఖ్యమైన సినిమా. బ్లఫ్ మాస్టర్ ని ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారు.. మళ్ళీ బ్లఫ్ మాస్టర్ 2 ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నారు.. దానికి రెండింతలు గొప్పగా వుండే సినిమా "గాడ్సే". హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ తో చెపుతున్నాను. పొట్టోడు గట్టోడు అనే సామెతకు.. నిలువెత్తు నిదర్శనమ్ డైరెక్టర్ గోపీ గణేష్ పట్టాభి. అద్భుతమైన కథతో గాడ్సే సినిమాని తీయబోతున్నారు.  మా కాంబినేషన్ లో ఇది సెకండ్ ఫిల్మ్. ఐశ్వర్య గ్రేట్ పెర్ఫార్మర్. తనకి ఇది తెలుగులో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. కళ్యాణ్ గారితో గాడ్సే సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన సపోర్ట్, ఎంకరేజ్ మెంట్ నెక్స్ట్ లెవల్ లో చేస్తున్నారు. సునీల్ కశ్యప్ వన్ ఆఫ్ ది బెస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆల్రెడీ తను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాకి సూపర్బ్ ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడు. మా కాంబినేషన్లో బిగ్ హిట్ కొట్టబోతున్నాం.. అన్నారు.

Advertisement GKSC

సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మీ, సాయికుమార్, సిజ్జు మీనన్, బ్రహ్మాజీ, ప్రకాష్ నాగ్, అశోక్ కుమార్, కోటేశ్వరరావు తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి బ్యానర్; సికే స్క్రీన్స్,  మ్యూజిక్; సునీల్ కశ్యప్, కెమెరా; సురేష్ సారంగ్, ఆర్ట్; బ్రహ్మ కడలి, ఫైట్స్; నభా, స్టోరీ సపోర్ట్; అర్జున్ తడేలు, కో-డైరెక్టర్; విష్ణు శ్రీనివాస్, కో-ప్రొడ్యూసర్; సివి రావ్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం; గోపీ గణేష్ పట్టాభి, నిర్మాత; సి.కళ్యాణ్.

Advertisement
Author Image