Movie Updates: "రావణాసుర" సెట్‌లో అడుగు పెట్టిన మాస్ మహారాజ రవితేజ
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న `రావణాసుర` సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. నేడు ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో మాస్ మహారాజ రవితేజ పాల్గొన్నారు.
ఫస్ట్ డే.. రావణాసుర.. ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది.. అంటూ రవితేజ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో పాటు యూనిట్‌తో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ఇందులో దర్శకుడు సుధీర్ వర్మ, ఫరియా అబ్దుల్లా, నిర్మాత అభిషేక్ నామా, రైటర్ శ్రీకాంత్ విస్సా, సినిమాటోగ్రఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ ఉన్నారు.
ఈ చిత్రంలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఉండబోతోన్నారు. అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడలు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ ఐదుగురిలో ప్రతీ ఒక్క పాత్రకు ప్రాముఖ్యత ఉండనుంది.నటీనటులు :రవితేజ, సుశాంత్, అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహత (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు
సాంకేతిక బృందం : డైరెక్టర్: సుధీర్ వర్మ,నిర్మాత: అభిషేక్ నామా, బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా, మ్యూజిక్: హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్, డీఓపీ: విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటర్: శ్రీకాంత్, ప్రొడక్షన్ డిజైనర్: డీఆర్‌కే కిరణ్, సీఈఓ: పోతిని వాసు, మేకప్ చీఫ్: ఐ శ్రీనివాస్ రాజు, పీఆర్వో : వంశీ-శేఖర్.