FILM NEWS: నిఖిల్ కుమార్, విజయ్ కుమార్ కొండా "రైడర్" మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం.
Hero Nikhil Kumar, Heroine Kashmira Paradeshi, Director Vijay Kumar Konda "Rider" Movie Shooting Resumes, New Telugu Movie, Telugu World Now.
FILM NEWS: నిఖిల్ కుమార్, విజయ్ కుమార్ కొండా `రైడర్` మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం.
మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’, ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `రైడర్`.
కాశ్మీరా పరదేశి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని చంద్ర మనోహరన్ నిర్మిస్తున్నారు. లహరి మ్యూజిక్ సంస్థ ఈ చిత్రంతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టింది. అర్జున్ జన్య సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీషా కుడువల్లి సినిమాటోగ్రాఫర్.
ఇప్పటికే విడుదలైన రైడర్ మోషన్‌పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ రోజునుండి రైడర్ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక వీడియోను విడుదలచేసింది చిత్రయూనిట్.
తెలుగు, కన్నడ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రంలో దత్తన్న, అచ్యుత కుమార్, రాజేష్ నటరంగ, శోభరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
తారాగణం:
యువరాజ నిఖిల్ కుమార్, కాశ్మీరా పరదేశి, దత్తన్న, అచ్యుత కుమార్, రాజేష్ నటరంగ, శోభరాజ్, చిక్కన్న, శివరాజ్ కేఆర్, నిహారిక, సంపద, అనూష
సాంకేతిక వర్గం:
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం - విజయ్ కుమార్ కొండ
నిర్మాత - చంద్రు మనోహరణ్
సంగీతం - అర్జున్ జన్య
సినిమాటోగ్రఫి - శ్రీషా కుడువల్లి
స్టంట్ డైరెక్టర్ - డా. రవి వర్మ
ఆర్ట్- మోహన్ బి కేరే
ఎడిటర్ - కేఎం ప్రకాశ్
రైటర్స్ - నంధ్యాల రవి, విజయ్ ప్రకాశ్
ప్రొడక్షన్ మేనేజర్ - నరసింహ జలహల్లి