Firstlook Poster Review: #NANI128 ఎర్ర చొక్క పంచె కట్టులో డిఫరెంట్ గెటప్ లో "అంటే సుందరానికీ..! చిత్ర జిరోత్ లుక్ విడుదల
నాని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అంటే సుందరానికీ. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీస్ సంస్థ అంటే సుందరానికి చిత్రాన్ని ప్రెస్టీజియస్ గా నిర్మిస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా అంటే సుందరానికీ చిత్రం నుంచి జిరోత్ లుక్ పోస్టర్, వీడియోను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో నాని ఎర్ర చొక్క పంచె కట్టులో డిఫరెంట్ గెటప్ లో కొత్తగా కనిపిస్తున్నారు. ఆయన లగేజీ బ్యాగ్ మీద హనుమాన్ బొమ్మ ఉంది. ప్రవర శ్లోకం చదువుతూ కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ అని తన పేరును, హరితాస్య అనే గోత్రాన్ని చెప్పుకున్నారు సుందరం. వెంటనే వెల్ కమ్ టు ద వరల్డ్ ఆఫ్ సుందరం అనే ఆహ్వానించారు.
ఈ 47 సెకన్ల వీడియో, పోస్టర్ తో సుందరం ప్రపంచం ఎంత సరదాగా, ఆహ్లాదకరంగా ఉండబోతుందో తెలుస్తుంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా అంటే సుందారినికీ సినిమా ఉంటుందని వీడియో ద్వారా అర్థమవుతోంది. నానికి ఈ సినిమా తప్పకుండా మరో డిఫరెంట్ మూవీ కానుంది. ఆవకాయ సీజన్ లో అంటే సమ్మర్ విడుదలకు అంటే సుందరానికీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని వీడియోలో ప్రకటించారు.
అంటే సుందరానికీ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది నజ్రియా నజిమ్ ఫహాద్. నికేత్ బొమ్మి.నటీనటులు - నాని, నజ్రియా నజిమ్ ఫహాద్, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు
సాంకేతిక నిపుణులు -
రచన దర్శకత్వం - వివేక్ ఆత్రేయ
నిర్మాతలు - నవీన్ యేర్నేని, రవి శంకర్ వై
బ్యానర్ - మైత్రీ మూవీ మేకర్స్
సీయీవో - చెర్రి
సంగీతం - వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ- నికేత్ బొమ్మి
ఎడిటర్ - రవితేజ గిరిజాల
ప్రొడక్షన్ డిజైన్ - లతా నాయుడు
పబ్లిసిటీ డిజైన్ - అనిల్ భాను
పీఆర్వో - వంశీ శేఖర్