For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

హీరో నాని "దసరా" చిత్ర ఫస్ట్ లుక్ విడుదల

08:55 PM Mar 21, 2022 IST | Sowmya
Updated At - 08:55 PM Mar 21, 2022 IST
హీరో నాని  దసరా  చిత్ర ఫస్ట్ లుక్ విడుదల
Advertisement

విభిన్నమైన చిత్రాలను చేస్తూ నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో నాని దసరా చిత్రంతో అలరించనున్నాడు. టాలెంటెడ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ గా దసరా రూపొందుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న నాని మొదటి పాన్ ఇండియా చిత్రం దసరా.

ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అయింది. ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు స్పార్క్ ఆఫ్ దసరా పేరుతో గ్లింప్స్ కూడా విడుదలయ్యాయి. పోస్టర్‌లో లుంగీ కట్టుకున్న నాని  పక్కనే నిప్పు ఉండటం దానిపై చెయ్యి పెడుతోన్న డిఫరెంట్ లుక్ నెటిజన్ల ను  ఆకట్టుకుంది. స్పార్క్ ఆఫ్ దసరా వీడియోలో నాని బీడీ వెలిగించి సింగరేణి మైన్స్ ద్వారా తన గ్యాంగ్‌తో కలిసి నడుస్తూ స్టైల్‌ గా ఎంట్రీ ఇచ్చాడు. దసరా గ్లింప్స్ కు  అద్భుతమైన స్పందన వచ్చింది.

Advertisement GKSC

Nani, Srikanth Odela, SLVC’s Dasara First Look And Spark Of Dasara Video Out, Telugu golden tv,my mix entertainments, teluguworldnow.com 1

తారాగణం : నాని, కీర్తి సురేష్, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది : దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల, నిర్మాత: సుధాకర్ చెరుకూరి, ప్రొడక్షన్ బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ ISC, సంగీతం: సంతోష్ నారాయణన్, ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ చాగంటి, PRO: వంశీ-శేఖర్.

Advertisement
Author Image