For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

హీరో నాని 'శ్యామ్ సింగ రాయ్' కోల్‌క‌తా షెడ్యూల్ ప్రారంభం.

02:00 PM May 03, 2024 IST | Sowmya
Updated At - 02:00 PM May 03, 2024 IST
హీరో నాని  శ్యామ్ సింగ రాయ్  కోల్‌క‌తా షెడ్యూల్ ప్రారంభం
Advertisement

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా, టాలెంటెడ్ యంగ్ డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యాన్ రూపొందిస్తోన్న చిత్రం 'శ్యామ్ సింగ రాయ్‌'. సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు.
ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర్నుంచీ ప్రేక్ష‌కుల్లో దీనిపై మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఈ మూవీలో ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని అత్యంత ఆస‌క్తిక‌ర పాత్ర‌ను నాని చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయ‌న కొత్త‌గా మేకోవ‌ర్ అయ్యారు కూడా.
ఈరోజు (గురువారం) ఈ సినిమా తాజా షెడ్యూల్ కోల్‌క‌తాలో ప్రారంభ‌మైంది. సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్లు స‌హా ప్ర‌ధాన తారాగ‌ణం అంతా పాల్గొంటుండ‌గా, ప‌లు కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు.
ఈ సినిమాలో రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ముర‌ళీ శ‌ర్మ‌, అభిన‌వ్‌ గోమ‌టం ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.
నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న ఈ తొలి చిత్రానికి స‌త్య‌దేవ్ జంగా క‌థ‌ను స‌మ‌కూర్చ‌గా, మెలోడీ సాంగ్స్ స్పెష‌లిస్ట్ మిక్కీ జె. మేయ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. స‌ను జాన్ వ‌ర్ఘీస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.
అత్యంత ప్ర‌తిభావంతులైన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ప‌నిచేస్తోన్న 'శ్యామ్ సింగ రాయ్' ఓ మాస్ట‌ర్‌పీస్‌గా రూపొందుతోంద‌నే అభిప్రాయం అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది.
తారాగ‌ణం:
నాని, సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ముర‌ళీ శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం
సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: రాహుల్ సాంకృత్యాన్‌
ప్రొడ్యూస‌ర్‌: వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి
బ్యాన‌ర్: నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
ఒరిజిన‌ల్ స్టోరీ: స‌త్య‌దేవ్ జంగా
మ్యూజిక్‌: మిక్కీ జె. మేయ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌ను జాన్ వ‌ర్ఘీస్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌. వెంక‌టర‌త్నం (వెంక‌ట్‌)
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

Advertisement GKSC
Advertisement
Author Image