For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Latest Telugu Movies: నాని హీరోగా న‌టిస్తోన్న రోమ్-కామ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ మూవీ "అంటే సుందరానికీ.."

05:22 PM Jan 25, 2022 IST | Sowmya
Updated At - 05:22 PM Jan 25, 2022 IST
latest telugu movies  నాని హీరోగా న‌టిస్తోన్న రోమ్ కామ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ మూవీ  అంటే సుందరానికీ
Advertisement

నేచురల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తోన్న 28వ చిత్రం `అంటే సుందరానికీ..`. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని వేసవిలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది.

ఈ సంద‌ర్భంగా ``ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రం షూటింగ్ పూర్తయింది. #అంటే సుందరానికి`` అని ప్రకటించిన నాని సెట్స్ చివరి రోజు తీసిన ఒక వీడియోను సోష‌ల్‌మీడియా ద్వారా పంచుకున్నారు.

Advertisement GKSC

నూతన సంవత్సరం సందర్భంగా విడుద‌లైన `అంటే సుందరానికీ..` ఫస్ట్ లుక్ లో నాని తన విలక్షణమైన ఫన్నీ లుక్ తో ఆశ్చర్యపరిచాడు. ఫ‌స్ట్ లుక్‌తోనే ఇదొక డిఫ‌రెంట్ మూవీ అని తెలియ‌జేశారు నాని. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో `కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్` అనేది నాని పాత్ర పేరు.

hero Nani, heroine Nazriya Fahadh, Director Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki movieShooting Wrapped Up, telugu golden tv, my mix entertainments, teluguworldnow.com1అంటే సుందరానికి చిత్రంతో నజ్రియా నజీమ్ ఫహద్ తెలుగులో అడుగుపెడుతోంది.

తారాగ‌ణం : నాని, న‌జ్రియా ఫ‌హ‌ద్‌, న‌దియ‌,హ‌ర్ష వ‌ర్ధ‌న్‌,రాహుల్ రామ‌కృష్ణ‌,సుహాస్‌

సాంకేతిక వ‌ర్గం : ర‌చ‌న‌, ద‌ర్శ‌కత్వం: వివేక్ ఆత్రేయ‌,నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ వై, బ్యాన‌ర్‌: మైత్రి మూవీ మేక‌ర్స్‌, సీఈఓ: చెర్రీ, సంగీతం: వివేక్ సాగ‌ర్‌, సినిమాటోగ్ర‌ఫి: నికేత్ బొమ్మి, ఎడిట‌ర్‌: ర‌వితేజ గిరిజ‌ల‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: ల‌త నాయుడు, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: ప‌ల్ల‌వి సింగ్‌, ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: అనిల్ భాను, పిఆర్ఓ: వంశీ- శేఖ‌ర్‌.

Advertisement
Author Image