For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood Movies : నాగశౌర్య, అనీష్ ఆర్ కృష్ణ, ఐరా క్రియేషన్స్ ‘కృష్ణ వ్రింద విహారి’ ఫస్ట్ లుక్ విడుదల

06:02 PM Jan 22, 2022 IST | Sowmya
Updated At - 06:02 PM Jan 22, 2022 IST
tollywood movies   నాగశౌర్య  అనీష్ ఆర్ కృష్ణ  ఐరా క్రియేషన్స్ ‘కృష్ణ వ్రింద విహారి’ ఫస్ట్ లుక్ విడుదల
Advertisement

హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య విభిన్న కథా చిత్రాలలో డిఫరెంట్ రోల్స్‌ను పోషిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ చిత్రాన్ని చేస్తున్నారు.

నాగ శౌర్య పుట్టిన రోజు (జనవరి 22) సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేక‌ర్స్‌. కృష్ణ వ్రింద విహారి అనే ఈ టైటిల్‌ ఎంతో ట్రెడిషనల్‌గా, కొత్త‌గా ఉంది. కృష్ణ, వ్రింద అనేవి హీరో హీరోయిన్ల పాత్ర‌ల పేర్లు అని తెలుస్తోంది. టైటిల్‌ను డిజైన్ చేసిన విధానం కూడా చక్కగా కుదిరింది.

Advertisement GKSC

ఈ పోస్టర్‌లో నాగ శౌర్య అందరినీ మెప్పించేలా ఉన్నారు. నిలువు బొట్టుతో బ్రాహ్మణుడిగా కనిపించారు. పోస్టర్ చూస్తుంటే పెళ్లి తంతులా ఉంది. మొత్తానికి పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

Hero Naga Shaurya, heroine Shirley Setia, Director Anish R Krishna, Ira Creations Krishna Vrinda Vihari movie First Look Out, telugu golden tv, my mix entertainments, teluguworldnow.com 1ఇప్ప‌టివ‌ర‌కు నాగ శౌర్య చేసిన పాత్రలన్నింటి కంటే ఈ రోల్ డిఫరెంట్‌గా ఉండబోతోంది అని తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగ శౌర్య పూర్తిగా స‌రికొత్త‌ పాత్రలో కనిపించబోతోన్నారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్త‌య్యింది. ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది.

నటీనటులు : నాగ శౌర్య, షిర్లే సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు

సాంకేతిక బృందం : దర్శకుడు: అనిష్ ఆర్ కృష్ణ, నిర్మాత: ఉషా మూల్పూరి, సమర్పణ: శంకర్ ప్రసాద్ మూల్పూరి, బ్యానర్: ఐరా క్రియేషన్స్, మ్యూజిక్ డైరెక్టర్: మహతి స్వర సాగర్, డీఓపీ: సాయి శ్రీరామ్, కో ప్రొడ్యూసర్: బుజ్జి, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, డిజిటల్ హెడ్: ఎం.ఎన్.ఎస్ గౌతమ్, పీఆర్వో : వంశీ-శేఖర్

Advertisement
Author Image