For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Entertainment : మంచి మనసును చాటుకున్న జగపతిబాబు..

07:50 PM Jan 05, 2023 IST | Sowmya
Updated At - 07:50 PM Jan 05, 2023 IST
entertainment   మంచి మనసును చాటుకున్న జగపతిబాబు
Advertisement

Entertainment ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతిబాబు ఒకప్పుడు హీరోగా మంచి పేరు సంపాదించుకున్న ఈయన తర్వాత జీవితంలో కొన్ని ఉడతలు ఎదుర్కొన్నారు అయినప్పటికీ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు అయితే జీవితంలో అన్ని కష్టాలు ఎదుర్కొని వచ్చానని ఎప్పటికప్పుడు చెప్పుకోవచ్చు జగపతిబాబు సామాన్యుల కష్టాలు సైతం అర్థం చేసుకుంటున్నారు అలాగే తాజాగా ఒక పేద విద్యార్థులకు ఇతను చేసిన సాయం ప్రస్తుతం వైరల్ గా మారింది..

ఒకప్పుడు హీరోగా ఎన్నో చిత్రాలు నటించారు జగపతిబాబు అయితే తర్వాత పలు కారణాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ సమయంలో డిప్రెషన్ కి వెళ్లి డబ్బులు మొత్తం పోగొట్టుకున్నారు అయినప్పటికీ మళ్లీ జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి లైఫ్ని స్టార్ట్ చేశారు అయితే మధ్యకాలంలో తన పడిన బాధలన్నీ తనకు జీవితం అంటే ఏంటో నేర్పించాలని ఎప్పటికప్పుడు చెప్పుకొస్తూనే ఉంటారు జగపతిబాబు అయితే తాజాగా.. సైదాబాద్ కు చెందిన జయలక్ష్మి అనే ఒక అమ్మాయి చదువుకో అండగా నిలిచారు జగపతిబాబు..

Advertisement GKSC

వివరాల్లోకి వెళితే.. జయ లక్ష్మి వరల్డ్‌ చిల్ట్రన్స్‌ పార్లమెంట్‌ ప్రధానిగా వ్యవహరిస్తోంది. డిగ్రీ చదువుతూనే పలు రకాల సామాజిక సమస్యలపై పోరాటం చేస్తోంది. అయితే ఆమెకు సివిల్స్ చదవాలని ఆలోచన ఉందంట కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిస్తూ ఉండటం వల్ల ఆమెకు ఆర్థికంగా సాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు ఈ విషయాన్ని ఒక దినపత్రికలో చదివిన జగపతిబాబు తల్లి ఆ అమ్మాయికి ఎలాగైనా సాయం చేద్దామని కోరగా అతను.. వెంటనే ఆమెకు సాయం చేస్తా అని అమ్మకు మాట ఇచ్చేశారట.. జయలక్ష్మిని పిలిపించి మాట్లాడారు. సివిల్స్‌ శిక్షణ కోసం అవసరమైన ఆర్థిక సాయం చేస్తానని కష్టపడి చదవాలని ఆమెకు సూచించారు జగపతిబాబు.

Advertisement
Author Image