For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood Updates: అతిథిని చూస్తే దేవుడులా భావించే యువ‌కుడి క‌థ‌తో "అతిధి దేవో భవ": ద‌ర్శ‌కుడు పొలిమేర నాగేశ్వర్

07:33 AM Jan 05, 2022 IST | Sowmya
Updated At - 07:33 AM Jan 05, 2022 IST
tollywood updates  అతిథిని చూస్తే దేవుడులా భావించే యువ‌కుడి క‌థ‌తో  అతిధి దేవో భవ   ద‌ర్శ‌కుడు పొలిమేర నాగేశ్వర్
Advertisement

అతిథిని చూస్తే దేవుడులా భావించే యువ‌కుడి క‌థ‌తో ‘అతిధి దేవో భవ’ చిత్రం రూపొందింద‌ని చిత్ర ద‌ర్శ‌కుడు పొలిమేర నాగేశ్వర్ తెలియ‌జేస్తున్నారు. రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మాత‌లు. ఆది సాయి కుమార్, నువేక్ష హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారంనాడు ద‌ర్శ‌కుడు పొలిమేర నాగేశ్వర్ విలేక‌రుల‌తో చిత్రం గురించి ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు.

మాది చోడ‌వ‌రం ద‌గ్గ‌ర బోగాపురం అనే మారుమూల గ్రామం. కాలేజీ రోజుల్లోనే సినిమాల‌పై ఆస‌క్తి ఎక్కువ‌. మ‌రోవైపు నాట‌కాల్లో కూడా ప్ర‌వేశం వుంది. బిటెక్ లో చేరినా సినిమా ఇంట్రెస్ట్ త‌గ్గ‌లేదు. అందుకే హైద‌రాబాద్ వ‌చ్చేశాను. మొద‌ట్లో వినాయ‌క్‌, కె.విశ్వ‌నాథ్‌, రాజ‌మౌళి వంటివారి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసే అవ‌కాశం క‌లిగింది. నేను ప‌లు క‌థ‌లు రాసుకున్నాను. ద‌ర్శ‌కుడిగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న క్ర‌మంలో రాజాబాబు మిర్యాల ప‌రిచ‌యం కావ‌డం దేవుడిలా అవ‌కాశం ఇవ్వ‌డం జ‌రిగింది. అలా మంచి టీమ్‌తో ఈ సినిమాకు ప‌నిచేశాను. తొలి సినిమానే సంక్రాంతికి విడుద‌ల కావ‌డం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అతిధి దేవో భవ చిత్రం ల‌వ్‌, యాక్ష‌న్, థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో వుంటుంది.

Advertisement GKSC

ట్రైల‌ర్‌లో భ‌యంమీద డైలాగ్ వుంది. అది ఏమిట‌నేది సినిమాలో చూడాల్సిందే. హీరో ఎందుకు భ‌య‌ప‌డున్నాడ‌నేది సినిమాకు హైలైట్‌ పాయింట్‌. ఇక సంగీత‌ప‌రంగా శేఖ‌ర్ చంద్ర బాణీలు ఆద‌ర‌ణ పొందింది. `బాగుంటుంది న‌వ్వితే.`. అనే పాట కాల‌ర్ ట్యూన్‌గా యూత్ పెట్టుకున్నారు. ఇప్ప‌టికి 4 మిలియ‌న్ల ప్ల‌స్ అయింది. ఇంకా మూడు సాంగ్‌లు హిట్ అయ్యాయి. ట్రైల‌ర్ ఆద‌ర‌ణ పొందింది. టైటిల్ ప‌రంగా చెప్పాలంటే ఇది క్లాస్ టైటిల్ అయినా.. అంద‌రికీ చేరుతుంది. క‌థ‌లో హీరోకు అంద‌రూ అతిథులే. అలా ఎందుకు అనుకుంటాడ‌నేది సినిమాలోనే చూడాల్సిందే. సినిమాకు వ‌చ్చి న‌ప్రేక్ష‌కుడు మంచి సినిమా చూశామ‌నే ఫీల్తో వుంటాడు.Hero Characterization at Athithi Devo Bhava is the highlight of the movie - Director Polimera Nageshwar,Nuveksha,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com.1

Advertisement
Author Image