For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: ఫిబ్రవరి 19న "నాంది" పలకనున్న అల్లరోడు..!

01:57 PM May 03, 2024 IST | Sowmya
Updated At - 01:57 PM May 03, 2024 IST
film news  ఫిబ్రవరి 19న  నాంది  పలకనున్న అల్లరోడు
Advertisement

కామెడీ చిత్రాలతో తనదైన శైలిలో నవ్వులు పంచిన హీరో అల్లరి నరేష్.. తన పంథా మార్చుకొని వస్తున్న ప్రయోగాత్మక చిత్రం ''నాంది’'. విజయ్ కనకమేడల దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఎస్.వీ 2 ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న నిర్మించాడు. అల్లరి నరేశ్ కెరీర్లో 57వ చిత్రంగా రూపొందిన 'నాంది' ప్రచార చిత్రాలతోనే ఆసక్తిని కలిగించింది. న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ వస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

వినూత్నమైన కథ కథనాలతో రూపొందిన 'నాంది' సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని ఇన్నాళ్లూ వెయిట్ చేసిన మేకర్స్.. ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ అనౌన్స్ మెంట్ పోస్టర్ ని వదిలారు. ఇందులో అల్లరి నరేష్ జైలు కూర్చొని తీక్షణంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.

Advertisement GKSC

ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చగా.. సిద్ జే సినిమాటోగ్రఫీ అందించారు. చోటా కె. ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేయగా.. రచయిత అబ్బూరి రవి సంభాషణలు అందించారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ - నవమి - హరీష్ ఉత్తమన్ - ప్రియదర్శి - ప్రవీణ్ - దేవి ప్రసాద్ - వినయ్ వర్మ - నర్సింహారావు - శ్రీకాంత్ అయ్యంగార్ - రమేష్ రెడ్డి - చక్రపాణి - మణిచందన ప్రమోదిని తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

Advertisement
Author Image